You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గడ్డకట్టిన కశ్మీర్: మైనస్ 7.6 డిగ్రీలు... 28 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు
శ్రీనగర్, చుట్టుపక్కల చలి తీవ్రమైంది. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకోవడంతో కుళాయిల్లో నీళ్లు కూడా గడ్డకట్టుకుపోయాయి.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం శ్రీనగర్‌లో 28 ఏళ్ల మళ్లీ రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గురువారం ఇక్కడ మైనస్ 7.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అంతకు ముందు 1990 డిసెంబర్ 7న కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 8.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇప్పటివరకూ కశ్మీర్‌లో అత్యంత తీవ్రమైన చల్లటి రోజు అదే.
1990 తర్వాత 2007 డిసెంబర్ 31న శ్రీనగర్‌లో మైనస్ 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఉదయం శ్రీనగర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి కుళాయిలు, జీలం నది, మిగతా నీళ్లున్న ప్రాంతాలన్నీ గడ్డకట్టుకుపోయాయి.
పహల్గాంలో మైనస్ 8.3 డిగ్రీలు, గుల్మార్గ్‌లో మైనస్ 9, లేహ్‌లో మైనస్ 8.4, కార్గిల్‌లో మైనస్ 16.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
పడవలు ముందుకు వెళ్లడానికి ప్రజలు జీలం నదిలో గడ్డకట్టిన మంచును పగలగొట్టి దారి చేసుకుంటున్నారు.
పడవలు నడిపేవాళ్లు ఉదయం అయినా బయటకు రావడం లేదు. నదిలో గడ్డకట్టిన మంచు వల్ల పడవలు దెబ్బతింటాయని వాళ్లు చెబుతున్నారు.
కశ్మీర్లో ఇప్పుడు 'చిల్లయి కలాన్' గుప్పిట్లో వణుకుతోంది. కశ్మీర్ లోయలో కూడా చలి తీవ్రంగా ఉంది. ఇది 40 రోజులపాటు ఉంటుంది. దీనినే చిల్లయి కలాన్ అంటారు.
ఈ కాలంలో మంచు విపరీతంగా కురుస్తుంది. ఉష్ణోగ్రతలు మరింత దిగువకు పడిపోవచ్చని భావిస్తున్నారు.
చిల్లయి కలాన్ జనవరి 31న ముగుస్తుంది. కానీ ఆ తర్వాత కూడా కశ్మీర్‌లో చలి గాలులు వీస్తూనే ఉంటాయి.
40 రోజుల చిల్లయి కలాన్ ముగిసిన తర్వాత 20 రోజులు చిల్లయి ఖుర్ద్(స్మాల్ కోల్డ్) ఉంటుంది, తర్వాత పది రోజులు చిల్లయి బచ్చా(బేబీ కోల్డ్) ఉంటుంది. ఇవి ప్రతి చలికాలంలో ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
- ఫొటోల్లో లక్షల ఏళ్ల భారత చరిత్ర!
- REALITY CHECK: ఈ ఫొటోలు ఇప్పటివి కావు!
- 'ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2018': పన్నెండు అత్యద్భుత ఫొటోలు
- పెళ్లి ఫొటోలను పోర్న్ ఫొటోలుగా మార్చి.. వివాహితుల బ్లాక్ మెయిల్
- పాత ఫొటో స్టూడియోలు ఏమవుతున్నాయి?
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- మహిళల్లో 'సున్తీ': పలు దేశాల్లో నిషేధించినా భారత్‌లో ఎందుకు కొనసాగుతోంది?
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ‘మహాభారతంలో రెండు కుటుంబాలు ఉండేవి. భారత్‌లో మాత్రం ఒకే కుటుంబం ఉంది’
- గగన్‌యాన్: ముగ్గురు భారతీయులు, ఏడు రోజులు, రూ.10 వేల కోట్ల వ్యయం
- న్యూయార్క్ ఆకాశంలో వింత కాంతి.. ‘ఏలియన్స్ రాకకు సంకేతమా?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)