You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మిస్ డెఫ్ ఆసియా నిష్టా డుడేజా: నన్ను స్పీకర్ లేని టీవీ అంటూ విమర్శలు చేశారు
‘‘నువ్వు స్పీకర్ లేని టీవీవి.. అని ఓ అబ్బాయి నన్ను కామెంట్ చేశాడు. ఎందుకంటే నాకు చెవుడు. కానీ అవన్నీ నేను పట్టించుకునేదాన్ని కాదు. నా లక్ష్యం మీదనే దృష్టి పెట్టేదాన్ని. ఇప్పుడు నేను మిస్ ఆసియా కిరీటాన్ని గెలిచాను’’ అని చెబుతున్నారు 23 ఏళ్ల నిష్టా డుడేజా.
హరియాణాకు చెందిన ఈమె ఇప్పుడు దిల్లీలో ఉంటున్నారు.
‘మిస్ డెఫ్ ఆసియా’ పోటీల్లో భారత్‌కు తొలిసారి కిరీటాన్ని సాధించిపెట్టిన అమ్మాయి నిష్టా.
ఈమె ఓ టెన్నిస్ క్రీడాకారిణి కూడా. 2013 ఒలింపిక్స్‌లో, 2015 డెఫ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరపున ఆడారు.
‘‘మొదట్లో నాకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండేది. ఓరోజు.. నా ఫ్రెండుకు తెలిసిన అమ్మాయి 'మిస్ బ్లైండ్' కిరీటం గెలుచుకుందన్న వార్తను విన్నాను. ఆ అమ్మాయి మిస్ బ్లైంట్ కిరీటం దక్కించుకుంటే, నేను 'మిస్ డెఫ్' కిరీటం ఎందుకు దక్కించుకోలేను అని ఆలోచించాను’’ అని ఆమె అన్నారు.
‘‘నాకు స్పోర్ట్స్ షూస్ వేసుకోవడం అలవాటు. అలాంటిది.. 5.5 ఇంచుల ఎత్తున్న హీల్స్ వేసుకుని ర్యాంప్‌పై నడవడం కష్టం అనిపించింది.
మేకప్ ఎలా వేసుకోవాలో నేర్చుకున్నాను. సింపుల్‌గా ఉండటమే నాకిష్టం’’ అని చెబుతున్న నిష్టాను ఓసారి పలుకరించండి. తన గురించి ఆమె చెబుతున్న విషయాలను ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ ఎన్నికలు.. బీబీసీ ప్రత్యేక కథనాలు
- పాము కాటేశాక ఏమవుతుంది? శాస్త్రవేత్త స్వీయ మరణగాథ
- జాతీయవాదం పేరిట వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్
- అడ్వాణీని కోలుకోలేకుండా చేసిన ఆ ఒక్క తప్పు
- ‘‘ఎక్స్పోజింగ్’తో సమస్యలు రావద్దనే.. ఊర్లో మహిళలు నైటీ ధరిస్తే.. రూ. 2,000 జరిమానా’
- కేరళ వరదలు: ఫేక్‌న్యూస్ ప్రవాహం
- ‘టెస్ట్ ట్యూ బ్‌లలో చెట్లు’.. ఎప్పుడైనా విన్నారా?
- ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ‘ఆవు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)