తెలంగాణ ఎన్నికలు: 65 మందితో కాంగ్రెస్ తొలి జాబితా.. అసెంబ్లీ బరిలో మాజీ ఎంపీలు

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ సోమవారం రాత్రి విడుదల చేసింది. 65 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన ఈ జాబితాను ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ విడుదల చేశారు.

మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, పొన్నం ప్రభాకర్‌, బలరాం నాయక్‌, మల్లు రవిలు ఈసారి శాసనసభ ఎన్నికల్లో పోటీపడనున్నారు.

నల్గొండ జిల్లా మునుగోడ్ నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి సర్వే సత్యనారాయణ, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, జడ్చర్ల నుంచి మల్లు రవి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ బరిలోకి దిగనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య పేరు ఈ జాబితాలో లేదు. ఇప్పటి వరకు పొన్నాల జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వచ్చారు. ఈ జాబితాలో జనగామ పేరు కూడా లేదు.

ఇదీ తొలి జాబితా..

  • సిర్పూర్- పాల్వాయి హరీశ్‌ బాబు
  • చెన్నూరు (ఎస్సీ) - వెంకటేశ్ నేత బోర్లకుంట
  • మంచిర్యాల- కొక్కిరాల ప్రేమ సాగర్ రావు
  • ఆసిఫాబాద్ (ఎస్టీ) - ఆత్రం సక్కు
  • ఆదిలాబాద్- గండ్రత్ సుజాత
  • నిర్మల్- ఆలేటి మహేశ్వర్ రెడ్డి
  • ముథోల్- రామారావు పటేల్ పవార్
  • ఆర్మూర్- ఆకుల లలిత
  • బోధన్- పి. సుదర్శన్ రెడ్డి
  • జుక్కల్ ఎస్సీ)- ఎస్. గంగారం
  • బాన్సువాడ- కాసుల బాలరాజు
  • కామారెడ్డి- షబ్బీర్ అలీ
  • జగిత్యాల- జీవన్ రెడ్డి
  • రామగుండం- మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
  • మంథని- దుద్దిల్ల శ్రీధర్ బాబు
  • పెద్దపల్లి- సి. విజయరమణారావు
  • కరీంనగర్- పొన్నం ప్రభాకర్
  • చొప్పదండి (ఎస్సీ)- మేడిపల్లి సత్యం
  • వేములవాడ- ఆది శ్రీనివాస్
  • మానకొండూరు (ఎస్సీ)- ఆరేపల్లి మోహన్
  • ఆందోల్ (ఎస్సీ)- దామోదర రాజనర్సింహ
  • నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి
  • జహీరాబాద్ (ఎస్సీ)- గీతారెడ్డి
  • సంగారెడ్డి- తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)
  • గజ్వేల్- వంటేరు ప్రతాప్ రెడ్డి
  • కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్
  • మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి
  • చేవెళ్ల (ఎస్సీ)- కే.ఎస్. రత్నం
  • పరిగి- రామ్మోహన్ రెడ్డి
  • వికారాబాద్ (ఎస్సీ)- గడ్డం ప్రసాద్ కుమార్
  • తాండూరు- పైలట్ రోహిత్ రెడ్డి
  • ముషీరాబాద్- ఎం. అనిల్ కుమార్ యాదవ్
  • నాంపల్లి- ఫిరోజ్ ఖాన్
  • గోషామహాల్- ముకేశ్ గౌడ్
  • చార్మినార్- మహ్మద్ గౌస్
  • చాంద్రాయణగుట్ట- ఇసా బినోబైద్ మిస్రీ
  • సికింద్రాబాబ్ కంటోన్మెంట్(ఎస్సీ) - సర్వే సత్యనారాయణ
  • కొడంగల్ - రేవంత్ రెడ్డి
  • జడ్చర్ల- మల్లు రవి
  • వనపర్తి- జి. చిన్నారెడ్డి
  • గద్వాల- డీ.కే. అరుణ
  • అలంపూర్ (ఎస్సీ)- సంపత్ కుమార్
  • నాగర్ కర్నూల్- నాగం జనార్ధన్ రెడ్డి
  • అచ్చంపేట(ఎస్సీ) - సీ.హెచ్ వంశీకృష్ణ
  • కల్వకుర్తి- వంశీచంద్‌రెడ్డి
  • నాగార్జున సాగర్- కుందూరు జానారెడ్డి
  • హుజూర్‌నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • కోదాడ- పద్మావతి రెడ్డి
  • సూర్యాపేట- ఆర్. దామోదర్ రెడ్డి
  • నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ ‌రెడ్డి
  • మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
  • భువనగిరి- కుంభం అనిల్ కుమార్ రెడ్డి
  • నకిరేకల్ (ఎస్సీ)- చిరుముర్తి లింగయ్య
  • ఆలేరు- భిక్షమయ్య గౌడ్
  • స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ)- సింగపూర్ ఇందిర
  • పాలకుర్తి- జంగా రాఘవరెడ్డి
  • డోర్నకల్ (ఎస్టీ)- జాటోత్ రామచంద్రు నాయక్
  • మహబూబాబాద్ (ఎస్టీ)- పోరిక బలరాం నాయక్
  • నర్సంపేట్- దొంతి మాధవ రెడ్డి
  • పరకాల- కొండా సురేఖ
  • ములుగు (ఎస్టీ)- డి. అనసూయ అలియాస్ సీతక్క
  • పినపాక (ఎస్టీ)- రేగ కాంతారావు
  • మధిర (ఎస్సీ)- మల్లు భట్టి విక్రమార్క
  • కొత్తగూడెం - వనమా వెంకటేశ్వరరావు
  • భద్రాచలం- పొడెం వీరయ్య

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)