తెలంగాణ ఎన్నికలు: డిసెంబరు 7న పోలింగ్, 11న ఫలితాలు

ఎన్నికల సంఘం తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు శనివారం షెడ్యూల్ విడుదల చేసింది.

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు దిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో ఇంకా ఓటర్ల తుది జాబితా సిద్ధం కాలేదని, తుది జాబితా కోసం శుక్రవారం రాత్రి వరకూ వేచి చూశామని ఆయన చెప్పారు.

అయితే, తుది జాబితాను సిద్ధం చేయటానికి మరో రెండు రోజుల గడువు కావాలని ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) కోరారని రావత్ వివరించారు.

హైదరాబాద్‌లోని హైకోర్టులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఒక కేసు పెండింగ్‌లో ఉందని, ఈ నెల 8 సోమవారం ఈ కేసు విచారణకు రానుందని ఆయన చెప్పారు. అదే రోజు తెలంగాణ సీఈవో ఓటర్ల తుది జాబితాను హైకోర్టుకు సమర్పించాల్సి ఉందని తెలిపారు.

ఇదీ షెడ్యూల్:

అన్ని రాష్ట్రాల్లో డిసెంబరు 11ఓట్లు లెక్కిస్తారు.

తెలంగాణ, రాజస్థాన్(ఒకే దశలో పోలింగ్)

నోటిఫికేషన్: నవంబరు 12

నామినేషన్లు: నవంబరు 12 నుంచి 19 వరకు

ఉపసంహరణ గడువు: నవంబరు 22

పోలింగ్: డిసెంబర్ 7

మధ్యప్రదేశ్, మిజోరం (ఒకే దశలో)

నోటిఫికేషన్: నవంబరు 2

నామినేషన్లు: నవంబరు 2 నుంచి నవంబరు 9

ఉపసంహరణ గడువు: నవంబరు 14

పోలింగ్: నవంబరు 28

ఛత్తీస్‌గఢ్ (రెండు దశల్లో)

ఫేజ్-1: 18 నియోజకవర్గాలకు(దక్షిణ ఛత్తీస్‌గఢ్ - మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు)

నోటిఫికేషన్: అక్టోబరు 16

నామినేషన్లు: అక్టోబర్ 16 నుంచి 23 వరకు

ఉపసంహరణ గడువు: అక్టోబరు 26

పోలింగ్: నవంబరు 12.

ఫేజ్ 2: ఉత్తర ఛత్తీస్‌గఢ్ (72 నియోజకవర్గాలు)

నోటిఫికేషన్: అక్టోబరు 26

నామినేషన్లు: అక్టోబర్ 26 నుంచి నవంబరు 2

ఉపసంహరణ గడువు: నవంబరు 5

పోలింగ్: నవంబర్ 20.

నాలుగు రాష్ట్రాల చిత్రం ఇలా..

మధ్యప్రదేశ్: 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీ గడువు 2019 జనవరి 7తో ముగుస్తుంది.

ఛత్తీస్‌గఢ్: 90 మంది సభ్యుల ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ గడువు 2019 జనవరి 5తో ముగుస్తుంది.

రాజస్థాన్: 200 మంది సభ్యులు ఈ అసెంబ్లీ గడువు 2019 జనవరి 20తో ముగియనుంది.

మిజోరం: 40 మంది సభ్యుల మిజోరం అసెంబ్లీ గడువు ఈ ఏడాది డిసెంబరు 15తో ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)