You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
195 కిలోల పులిని మరో చోటికి తరలించడం ఎలాగంటే..
మధ్యప్రదేశ్ నుంచి 195 కిలోల బరువున్న పులిని అక్కడికి 600 కిలోమీటర్ల దూరంలో.. ఒడిశాలో ఉన్న అభయారణ్యానికి తరలించారు. ఈ భారీ ఆపరేషన్‌లో అనేక మంది అటవీ అధికారులతో పాటు వన్యప్రాణి సంరక్షకులు, ఐదు ఏనుగులు పాల్గొన్నాయి.
అటవీ అధికారులు ఎంబీ2 అనే పేరు పెట్టిన ఈ మగ పులి వయసు మూడేళ్లు. ఇది మధ్యప్రదేశ్‌లోని కన్హా జాతీయ పార్క్‌లో ఉండేది.
ఒడిశాలోని సత్కోసియా రిజర్వ్‌లో పులుల సంఖ్యను పెంచేందుకు మధ్యప్రదేశ్ నుంచి పులులను అక్కడికి తరలించాలని నిర్ణయించారు. అలా తరలించాలని నిర్ణయించిన ఐదు పులులలో ఎంబీ2 ఒకటి.
ఈ నెల 20న ఎంబీ2ను ఈ ప్రాజెక్టు కింద ఒడిశాకు తరలించారు.
ఇలాంటి ఆపరేషన్‌ను చేపట్టడం కూడా భారతదేశంలో ఇదే మొదటిసారి అని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
''ఎంబీ2 తరలింపు వల్ల ఈ ప్రాజెక్టు కింద సత్కోసియాలో పులుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నాం'' అని అటవీ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
సత్కోసియా రిజర్వ్‌లో కేవలం రెండు ఆడ పులులు ఉన్నట్లు భావిస్తున్నారు.
అయితే ఎంబీ2ను బంధించడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని మధ్యప్రదేశ్ అటవీశాఖ సంరక్షకులు సంజయ్ శుక్లా తెలిపారు.
మొదట దానికి మత్తు మందు ఇచ్చి, ఆ తర్వాత ప్రత్యేకంగా తయారు చేసిన బోను ఉన్న ట్రక్ వద్దకు దానిని తీసుకెళ్లారు. పులిని ఒడిశాకు తరలించడం కోసం ఈ ట్రక్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు.
మత్తులో ఉన్న పులిని మోసుకెళ్లేటప్పుడు దానిని ఐదు ఏనుగులపై అధికారులు అనుసరించారు.
జూన్ 21 మధ్యాహ్నం ఎంబీ2 సత్కోసియా చేరుకోగా, మొదట దానిని రిజర్వ్‌లోని ఎంక్లోజర్‌లోకి వదిలారు. అది కొత్త వాతావరణానికి అలవాటు పడేంత వరకు ఎంక్లోజర్‌లోనే ఉంటుంది. ఆ తర్వాత దానిని అడవిలోనికి వదులుతారు.
మరికొన్ని నెలల వ్యవధిలో మధ్యప్రదేశ్ నుంచి మూడు మగ పులులు, ఒక ఆడపులిని కూడా ఒకదాని వెంట ఒకటి సత్కోసియాకు తరలిస్తారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఇది ప్రపంచంలోనే అత్యంత రొమాంటిక్ ప్రదేశం’
- మొబైల్ గేమ్స్: ఇది వ్యసనమే కాదు.. ఓ వ్యాధి
- జార్ఖండ్: వీధి నాటకం ప్రదర్శిస్తున్న కార్యకర్తల కిడ్నాప్.. అత్యాచారం
- భారత్-రష్యా మధ్య దూరం పెరుగుతోందా?
- వీడియో: పులి - ఎలుగు పోరు... గెలుపెవరిది?
- పులులు, ఎలుగుబంట్లు, మొసళ్లు ఈయన నేస్తాలు
- నల్లమల: సంపర్కం, ఆవాసం కోసం పులుల మధ్య పోరాటం
- #FIFA2018: రష్యాలో ఫుట్‌బాల్ అభిమాలకూ గూగుల్ ట్రాన్సిలేట్కి ఏంటీ సంబంధం?
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీసు ఇది.. భారత్‌లోనే ఉంది
- ఉపగ్రహ చిత్రాలు: భారత్‌లో గాలి ఎందుకిలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)