ఇస్లామిక్ స్టేట్ జిహాదీల భార్యలు ఎక్కడ?
ఉత్తర ఇరాక్‌లో స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్ ఓటమి పాలై పది నెలలు గడిచాయి. కానీ, ఆ యుద్ధ పర్యవసానాలు మాత్రం వెంటాడుతున్నాయి. ఐఎస్ బాధితులైన లక్షల మందికి తమ జీవితాలను పునర్నిర్మించుకోవడం ఎప్పటికైనా సాధ్యమవుతుందా?
ఈ పర్యవసానాలను అనుభవిస్తున్న మరో సమూహం, ఐ.ఎస్. మిలిటెంట్ల కుటుంబ సభ్యులు, వారి భార్యలు.
వారంతా ఈ సంస్థలో చేరడానికి విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు.
యుద్ధంలో చాలా మంది మిలిటెంట్లు చనిపోయి ఉండవచ్చు. కానీ, వారి భార్యలు, పిల్లలు ఉన్నట్లుండి కనిపించకుండాపోయారు.
వారు ఏమైపోయారు? అంతుచిక్కని ఈ పరిణామంపై బీబీసీ ప్రతినిధి టిమ్ వెల్ అందిస్తున్న కథనాన్ని పై వీడియోలో చూడొచ్చు.
(ఈ వీడియోలో మనసును కలచివేసే దృశ్యాలు ఉన్నాయి)
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)