కర్ణాటక ఎన్నికలు: ఎగ్జిట్‌ పోల్స్‌‌ ఏం చెబుతున్నాయి!

కర్ణాటక పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ మిగిలింది. విజయంపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. కానీ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు?

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు?

హస్తం అధికారాన్ని నిలబెట్టుకోబోతోందా?

దక్షిణాదిన పాగా వేయాలన్న కమలనాథుల కల నెరవేరబోతోందా?

పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్ ఏం తేల్చాయి?

కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకుగాను శనివారం 222 స్థానాలకు పోలింగ్ జరిగింది.

సుమారు 70 శాతం ఓటింగ్ నమోదైంది. ఫలితాలు మే 15న వెలువడనున్నాయి.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 113 సీట్లు గెలవాలి.

పోలింగ్ ముగిసిన వెంటనే పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి.

బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని కొన్ని ఎగ్జిట్‌ పోల్స్ వెల్లడించాయి.

అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అసరమైన మ్యాజిక్ ఫిగర్ చేరుకునేందుకు చాలా దూరంలోనే ఆగిపోతుందని చెప్పాయి.

కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని మరికొన్ని ఎగ్జిట్‌పోల్స్ చెప్పాయి.

హంగ్ ఏర్పడే అవకాశం లేకపోలేదని ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీ ఎడిటర్‌ స్మితా ప్రకాశ్ అభిప్రాయపడ్డారు.

ఎగ్జిట్ పోల్స్‌పై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు.

కర్ణాటక ఎగ్జిట్‌ పోల్స్ చూడటం కంటే గందరగోళం మరొకటి ఉండదని ఆయన అన్నారు.

ఎగ్జిట్ పోల్స్‌ విషయంలోనూ హంగ్ ఏర్పడిందని చమత్కరించారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.