త్రిపురలో కమల వికాసం.. సుదీర్ఘ కమ్యూనిస్టు పాలనకు తెర

త్రిపురలో పాతికేళ్ల సీపీఎం పరిపాలన ముగిసింది. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లభించింది.

మేఘాలయలో కాంగ్రెస్‌కు మెజార్టీ స్థానాలు లభించాయి. కానీ, విజయానికి అవసరమైనన్ని సీట్లు గెలవలేకపోయింది.

నాగాలాండ్‌లో బీజేపీ, నాలా పీపుల్స్ ఫ్రంట్ కూటమి విజయం సాధించింది.

మూడు ఈశాన్య రాష్ట్రాలు - త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీలకు ఎన్నికలు పూర్తవగా శనివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైంది.

త్రిపురలో 59 స్థానాలకు గాను 34 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా.. మరో స్థానంలో ముందంజలో ఉంది. సీపీఎం 13 స్థానాల్లో గెలుపొందగా, మరో మూడు స్థానాల్లో ముందంజలో ఉంది. ఐపీఎఫ్‌టీ 8 స్థానాల్లో విజయం సాధించింది.

త్రిపుర ఫలితాల సరళి

త్రిపురలో ఫిబ్రవరి 18న, నాగాలాండ్‌, మేఘాలయాల్లో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నా, వేర్వేరు కారణాలతో 59 స్థానాలకు మాత్రమే పోలింగ్‌ జరిగింది.

పదేళ్లుగా కాంగ్రెస్ పాలనలో ఉన్న మేఘాలయలో ఈసారి కాంగ్రెస్ మట్టి కరుస్తుందని భావించగా, అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది.

ఇక్కడ 21 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించగా, బీజేపీ కేవలం 2 స్థానాల్లో గెలుపొందింది. 19 స్థానాలతో ఎన్‌పీపీ ఇక్కడ రెండో స్థానంలో ఉంది.

మేఘాలయ ఫలితాల సరళి

అటు నాగాలాండ్‌లోను పోరు హోరాహోరీగా జరిగింది.

నాగా పీపుల్స్ ఫ్రంట్ 24 స్థానాల్లో గెలుపొందగా.. 14 స్థానాల్లో విజయం సాధించి ఎన్డీపీపీ రెండో స్థానంలో, 9 స్థానాలలో గెలుపొంది బీజేపీ మూడో స్థానంలో ఉన్నాయి. ఎన్‌పీపీ మూడు, ఎన్డీపీపీ రెండు, బీజేపీ రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

నాగాలాండ్ ఫలితాల సరళి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)