మహాత్మా గాంధీజీ అరుదైన చిత్రాలు

ఈరోజు మహత్మాగాంధీ వర్థంతి. ఈ సందర్భంగా గాంధీకి చెందిన కొన్ని అరుదైన ఫొటోలను బీబీసీ న్యూస్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాం. గాంధీ ఫిల్మ్ ఫౌండేషన్ ద్వారా ఈ చిత్రాలను బీబీసీ సేకరించింది.

మహాత్మా గాంధీ తల్లిదండ్రులు పుత్లీ భాయి, కరమ్‌చంద్ గాంధీ

బాల్యంలో (ఎడమ), యవ్వనంలో (కుడి) మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ

ఈ రెండు చిత్రాలు... 1880ల్లో ఆయన న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి దక్షిణాఫ్రికా వెళ్లినప్పటి చిత్రాలు.

ఈ రెండు చిత్రాల్లో గాంధీ ఆయన భార్య కస్తూర్బా గాంధీతో కనిపిస్తారు. ఆమెను అందరూ ప్రేమగా "బా" అని పిలిచేవారు.

తన సన్నిహితులతో గాంధీ (ఎడమ), ఒక సభలో మట్లాడుతున్న మహాత్మా గాంధీ (కుడి)

1930లో దండి యాత్రను చేపడుతున్న గాంధీ

ఈ రెండు చిత్రాల్లోనూ... ఆయన రైల్లో ప్రయాణిస్తూ, తన అనుచరులతో మాట్లాడుతూ కనిపిస్తారు. గాంధీ ఎప్పుడూ రైల్లో మూడో తరగతిలోనే ప్రయాణం చేసేవారు.

జవహర్‌లాల్ నెహ్రూతో గాంధీ

మహమ్మద్ అలీ జిన్నాతో గాంధీ

కాంగ్రెస్ సమావేశంలో నేతాజీతో చర్చలు జరుపుతున్న గాంధీ

తనకు అత్యంత సన్నిహితులైన ఆభా, మనులతో గాంధీ

గాంధీకి చరఖా అంటే చాలా మక్కువ. చరఖా మీద తయారైన బట్టలనే ఆయన ధరించేవారు.

ఒక ఉదయపు నడకలో, చిన్న పిల్లవాడితో ఉల్లాసంగా గాంధీ

1930ల్లో బ్రిటన్ యాత్ర సందర్భంగా అక్కడ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు.

1948 జనవరి 30న నాధూరామ్ గాడ్సే తన తుపాకీ గుళ్ళతో గాంధీని బలిగొన్నాడు. ఇవి జాతిపిత అంతిమ యాత్రా చిత్రాలు. ఆయన పార్థివ దేహం (కుడివైపు).

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)