ఓల్డ్‌మాంక్ సృష్టికర్త మృతి

దేశంలో ప్రముఖ మద్యం బ్రాండ్.. ఓల్డ్‌మాంక్ రమ్‌ను కనిపెట్టిన బ్రిటీష్ మాజీ సైనిక అధికారి కపిల్ మోహన్ (88) మ‌ృతి చెందారు.

గత కొన్ని రోజులుగా హృద్రోగంతో బాధపడుతున్న ఆయన ఘజియాబాద్‌లోని తన సొంత ఇంట్లో శనివారం చనిపోయారు.

1954లో ఈయన పరిచయం చేసిన ఓల్డ్ మంక్ రమ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.

ఈయనకు మద్యం తాగే అలవాటు లేదనీ చెబుతారు.

ఓల్డ్‌మాంక్‌ను తయారు చేసిన తర్వాత కపిల్ మోహన్ సంస్థ దేశంలో బాగా వృద్ధి చెందింది.

2010లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది.

కపిల్ మోహన్ మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, ఓల్డ్‌మాంక్ ప్రియులు సోషల్ మీడియాలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ అంశంపై ట్వీట్ చేసిన వారిలో మాజీ క్రికెటర్ సచిన్ కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)