ప్రకాశ్‌రాజ్ ఇంటర్వ్యూ-2: పవన్ కల్యాణ్ ఆశయాలు, ఆవేదన నాకు తెలుసు!
తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. రాజకీయాలు తనకు ఇష్టం లేదని, ప్రశ్నించడమే ఇష్టమని తెలిపారు.
బీబీసీ తెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రకాశ్ రాజ్ పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఒక అభిమానిగా ఓటు వేస్తే, ఆ తర్వాత ప్రశ్నించే నైతిక హక్కు కోల్పోతారని ఆయన అన్నారు.
పవన్ కల్యాణ్ ఆశయాలు, ఆవేదన తనకు తెలుసు అన్నారు. పవన్ తనకు నచ్చాడని ప్రకాశ్ రాజ్ చెప్పారు. అయితే, పవన్ పిలిచినా, కమల్ పిలిచినా రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. వాళ్ల విధానాలు నచ్చితే మాత్రం మద్దతిస్తానని వివరించారు.
తప్పులపై ప్రశ్నిస్తే యాంటీ మోదీ ట్యాగ్ తగిలిస్తున్నారని ప్రకాశ్ రాజ్ అన్నారు. ప్రశ్నిస్తే మీకు కంగారెందుకు, బెదిరింపులు ఎందుకు అని ఆయన నిలదీశారు.
'నా ప్రశ్నలకు మీ దగ్గర జవాబు లేదా? లేక దొరికిపోతామనే భయమా?' అని ప్రకాశ్ రాజ్ అడిగారు.
మా ఇతర కథనాలు:
- తమిళ రాజకీయాల్లో కమల్ రాణిస్తారా?
- మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోగల ప్రతిపక్షమేదీ?
- షారుఖ్ తల్లిది మన హైదరాబాదే
- సెంచరీ కొట్టిన రూపాయి నోటు
- తిరుమలలో తన మతం గురించి సోనియా గాంధీ ఏం చెప్పారు?
- నాకూ పిల్లలు కావాలంటున్న రోబో
- ట్వీట్ల విషయంలో బ్రిటన్ ప్రధానిపై ట్రంప్ గరం గరం
- ‘మగాళ్లు చేస్తే ఒప్పు ఆడవాళ్లు చేస్తే తప్పా?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)