ఈ ఆదివాసీ అమ్మాయిలు క్రికెట్ ఎలా ఆడుతున్నారో చూశారా..
ఈ ఆదివాసీ అమ్మాయిలు క్రికెట్ ఎలా ఆడుతున్నారో చూశారా..
మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని ఆదివాసీ తెగకు చెందిన బాలికలకు క్రికెట్ పట్ల ఉన్న ఆకర్షణ వారికి చదువుపైనా ఇష్టం పెరిగేలా చేసింది.
ఒకప్పుడు స్కూలు మానేసిన ఈ అమ్మాయిలు చదువుకోవడంతో పాటు జపనీస్ కూడా నేర్చుకుంటున్నారు.
ఈ బాలికలంతా ఏదో ఒక రోజు స్టేడియంలో క్రికెట్ ఆడతామని కల కంటున్నారు. వాళ్లేమీ పెద్ద పెద్ద క్లబ్‌ల నుంచి వచ్చిన వాళ్లు కాదు. వీరంతా ఆదివాసీ తెగ గోండుల పిల్లలు.
'సిద్ధేశ్వరి ఆదివాసీ గోండ్ బస్తీ' నాగ్‌పూర్‌లో ఉంది. కనీస మౌలిక సదుపాయాలు, ఇంట్లో కడుపునిండా తినడానికి సరిపడా ఆహారం లేని పరిస్థితుల మధ్య వీరు జీవిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









