ఎయిర్ స్ట్రైక్స్: పాకిస్తాన్‌పై భారత వైమానిక దాడి దృశ్యాలివే
పాకిస్తాన్, పాకిస్తాన్ పాలిత కశ్మీర్లోని లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని సైనిక దాడులు చేశామని భారత్ ప్రకటించింది.
పహల్గామ్ లో 26 మంది పర్యటకుల ప్రాణాలను బలిగొన్న తర్వాత పాకిస్తాన్, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని తీవ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ప్రణాళిక రచించి, నిర్వహించామని పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిగిన ఈ దాడిలో తొమ్మిది స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు భారత్ తెలిపింది.
పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని, చాలా జాగ్రత్తగా ఈ దాడి జరిగినట్టు భారత్ తెలిపింది. అయితే ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సహా 8మంది మృతి చెందినట్లు పాకిస్తాన్ తెలిపింది.


ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









