పాల్ మెకంజీ: ఆకలితో చనిపోతే స్వర్గానికి వెళ్తారని చెప్పి 191 మందిని హత్య చేశారంటూ పాస్టర్‌పై కేసు

ప్రపంచం త్వరలో అంతమవుతుందని, తిండి మానేసి చనిపోతే త్వరగా స్వర్గానికి వెళ్తారని చెప్పి కెన్యాలో వందల మందిని చంపేసిన ఘటన 2023లో వెలుగులోకి వచ్చింది.

‘డూమ్స్ డే కల్ట్’గా పిలిచే ఈ ఉదంతంలో 191 మందిని హత్య చేశారంటూ పాస్టర్ పాల్‌ మెకంజీతోపాటు ఆయన అనుచరుల మీద ఇటీవల కేసు నమోదు చేశారు.

పాల్ మెకంజీ, ఇతర నిందితులు తాము నిర్దోషులమని మిలింది పట్టణ కోర్టులో వాదించారు.

ఆగ్నేయ కెన్యాలోని షాకహోలా ప్రాంతంలో ఆకలితో చనిపోయిన వారిని సామూహిక సమాధి చేశారు.

క్రైస్తవ మత బోధకుడు మెకంజీకి చెందినదిగా భావిస్తున్న భూమిలో గతంలో తవ్వకాలు జరపగా, 400కు పైగా మృతదేహాలు బయటపడ్డాయి.

కొన్ని సమాధుల్లో పిల్లల మృతదేహాలు లభించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)