మేడారం: న్యూజిలాండ్‌ మావోరి తెగ హాకా నృత్య ప్రదర్శన

మేడారం: న్యూజిలాండ్‌ మావోరి తెగ హాకా నృత్య ప్రదర్శన

తెలంగాణలోని ములుగు జిల్లాలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా న్యూజిలాండ్‌ నుంచి మావోరి తెగ ప్రతినిధులు వచ్చారు.

గద్దెల ప్రాంగణంలో వారు హాకా నృత్య ప్రదర్శన చేశారు. వారితో కలిసి మంత్రి సీతక్క నృత్యం చేశారు.

అనంతరం మావోరి తెగ ప్రతినిధులు వన దేవతల దర్శనం చేసుకున్నారు.

తెలంగాణ–న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా మావోరి తెగ ప్రతినిధులు మేడారం జాతరకు వచ్చారని తెలంగాణ ఐఅండ్‌పీఆర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)