ఒమన్: ‘‘నన్ను అమ్మేస్తానని బెదిరించేవారు’’

వీడియో క్యాప్షన్, ఇది పెద్ద సమస్య అంటున్న అధికారులు
ఒమన్: ‘‘నన్ను అమ్మేస్తానని బెదిరించేవారు’’

ఒమన్ వెళ్లి నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని ఆశపడుతున్న చాలా మంది మహిళలు… ఫేక్ ట్రావెల్ ఏజెంట్ల మోసాలతో నిండా మునిగిపోతున్నారు.

నిరక్షరాస్యత కారణంగా మోసగాళ్ల చేతుల్లో చిక్కి, వెనక్కి వచ్చే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు.

అయితే అలాంటి వారిలో కొందరు భారత దౌత్య కార్యాలయం సాయంతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. బీబీసీ ప్రత్యేక కథనం.

అమ్రిత్‌పాల్ కౌర్

పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ జిల్లాకి చెందిన అమ్రిత్‌పాల్ కౌర్ ఇంటర్ వరకు చదువుకున్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా చదువు కొనసాగించలేకపోయిన ఆమె ప్రభుత్వం ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.

సంపాదన కోసం ఇతర దేశాలకైనా వెళ్లాలనుకున్న అమృత్ ‌పాల్ ఓ ట్రావెల్ ఏజెంట్‌ సాయంతో ఒమన్ చేరుకున్నారు. అయితే, అక్కడ ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)