You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రెండు యుద్ధ విమానాలు.. ఆకాశంలో ఢీకొని కుప్పకూలాయి
డాలస్ దగ్గర జరుగుతున్న ఎయిర్‌షోలో శనివారం నాడు రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన రెండు పాతకాలపు యుద్ధ విమానాలు.. ఆకాశంలో ఢీకొని కుప్పకూలాయి.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోల్లో.. ఆ రెండు విమానాలు తక్కువ ఎత్తులోనే ఢీకొనటం, ఒక విమానం సగానికి విరిగిపోవటం కనిపిస్తోంది. అవి కూలిపోయిన తర్వాత భారీ మంట చెలరేగింది.
ఈ రెండు విమానాల్లో ఎంత మంది ఉన్నారు, ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఈ విమానాల్లో ఒకటి బోయింగ్ బి-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ మీద అమెరికా గెలవటానికి బీ-17 బాంబర్ ప్రధాన పాత్ర పోషించింది.
రెండో విమానం ‘పి-63 కింగ్‌కోబ్రా’ యుద్ధ విమానాన్ని కూడా అదే వార్‌లో ఉపయోగించారు.
అమెరికాలో మాజీ సైనికుల గౌరవార్థం ‘వింగ్స్ ఓవర్ డాలస్ ఎయిర్‌షో’ పేరుతో రెండో ప్రపంచ యుద్ధం సంస్మరణగా మూడు రోజుల పాటు వైమానిక విన్యాసాలను నిర్వహిస్తున్నారు.
విమానాలు ఢీకొని కుప్పకూలటం ‘ఘోర విషాద’మంటూ డాలస్ మేయర్ ఎరిక్ జాన్సన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్యా ఇంకా నిర్ధరణ కాలేదని, అయితే నేల మీద ఎవరూ గాయపడలేదని ఆయన ఒక ట్వీట్‌లో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: ‘అల్లాహు అక్బర్’ అనాలంటూ తనపై దాడి చేశారని రాష్ట్రపతికి ‘లా’ కాలేజీ విద్యార్థి ఫిర్యాదు - అయిదుగురు విద్యార్థులు అరెస్ట్
- అమ్మకానికి ఊరు.. ధర రూ.2 కోట్లు.. స్పెయిన్‌లో బంపర్ ఆఫర్
- కేరళలో 32,000 మంది మహిళలు మతం మారి, ఇస్లామిక్ టెర్రరిస్టులు అయ్యారా? అదా శర్మ సినిమాపై వివాదం ఎందుకు?
- చిత్రకూట్, తీర్థగఢ్ వాటర్‌ఫాల్స్.. విశాఖకు దగ్గరలో బాహుబలి జలపాతం
- విమానాశ్రయంలోనే 18 ఏళ్లు జీవించిన వ్యక్తి మృతి.. స్టీఫెన్ స్పీల్బర్గ్ ‘ది టెర్మినల్’ సినిమాకు అతడే స్ఫూర్తి
- ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలతో పర్యావరణానికి హాని ఎంత, భారీ లిథియం గనులున్న ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది?
- 650 రూపాయల ట్విటర్ బ్లూ టిక్.. ఒక కంపెనీకి ఒక్క రోజులో రూ.1.22 లక్షల కోట్లు నష్టం తెచ్చింది.. ఎలాగంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)