విజయవాడ: బుడమేరు బీభత్సానికి ఏడాది, అప్పుడు - ఇప్పుడు 11 ఫోటోలలో..

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్, సాయికృష్ణ
    • హోదా, బీబీసీ కోసం

2024...ఆగస్ట్ 30, 31 తేదీల్లో విజయవాడ, గుంటూరు పరిసరాల్లో రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షంతో బుడమేరు వరద నీరు సగానికి పైగా బెజవాడను ముంచేసింది. అజిత్ సింగ్‌ నగర్, రామకృష్ణాపురం, అరుణోదయనగర్, డాబాకొట్టు సెంటర్, నందమూరినగర్, నున్న ప్రాంతాలను ముంచెత్తింది. విజయవాడ వన్‌టౌన్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నంలోనూ వరద నీరు మొదటి అంతస్తుల వరకూ చేరింది.

అలాంటి భయానకమైన పరిస్థితికి కారణమైన బుడమేరు వరదలు వచ్చి ఈ నెల 30 వ తేదీకి ఏడాది అవుతుంది.

వరదలకు ఎక్కువగా ప్రభావితమైన అజిగ్ సింగ్ నగర్, డాబాకొట్టు సెంటర్, అరుణోదయ నగర్, ప్రకాశం బరాజ్‌ల వద్ద అప్పటి వరద ఉధృతి, ప్రస్తుత పరిస్థితిని 2025 ఆగస్ట్ 20న బీబీసీ కెమెరా క్లిక్‌మనిపించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)