You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎగ్జిట్ పోల్స్ 2022: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని మధ్య, ఉత్తర ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ ముగిసింది.
రాష్ట్రంలో మొదట దశ ఎన్నికల్లో భాగంగా డిసెంబరు 1న పోలింగ్ జరిగింది. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లోని 82 స్థానాలకు ఆ రోజు పోలింగ్ నిర్వహించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని 68 నియోజకవర్గాలకు కూడా నవంబరు 12న పోలింగ్ జరిగింది.
గుజరాత్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 8న అంటే గురువారం వెల్లడించనున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
గుజరాత్‌లోని రెండో దశ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత సోమవారం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను భిన్న సంస్థలు వెల్లడించాయి.
గుజరాత్‌లో బీజేపీకి 125 నుంచి 143 మధ్య వస్తాయని, కాంగ్రెస్‌కు 30 నుంచి 48 మధ్య వస్తాయని, ఆప్‌కు మూడు నుంచి ఏడు సీట్లు వస్తాయని పీపుల్స్ సర్వే అంచనా వేసింది.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఏ పార్టీకి ఏ సంస్థా స్పష్టమైన ఆధిక్యం ఇవ్వడం లేదు.
ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబరు 8న ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
మరోవైపు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 7న ప్రకటించనున్నారు.
ఇవి కూడా చదవండి:
- కోహిస్తాన్: పరువు హత్యల పేరుతో ఈ జిల్లాలో అమ్మాయిలు, అబ్బాయిలను చంపుతున్నారు
- మీరు తాగే నీటిలో రకాలు ఎన్ని.. ఆర్వో, వాటర్ ఫిల్టర్ల నీళ్లను తాగితే ఏమవుతుంది
- ఖతార్: ఈ కృత్రిమ ద్వీపం ప్రత్యేకత ఏంటి.. ప్రజలు ఇక్కడ ఉండటానికి ఎందుకు ఎగబడుతున్నారు
- మహిళా లీడర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వారిపై నమ్మకం తగ్గుతోంది... ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)