బ్యాటరీ లేకుండా ఎలక్ట్రిక్ స్కూటర్.. తైవాన్ కొత్త ప్రయోగం

బ్యాటరీ లేకుండా ఎలక్ట్రిక్ స్కూటర్.. తైవాన్ కొత్త ప్రయోగం

ముంబై నుంచి బ్యాంకాక్, జకార్తా వరకూ ఆసియాలో ఎక్కడచూసినా స్కూటర్లే ప్రధాన వ్యక్తిగత వాహనాలు.

వాడకానికి సులువుగా ఉండే స్కూటర్లు పొగను విపరీతంగా గాల్లోకి వదులుతున్నాయి.

కాలుష్యాన్ని నివారించాలంటే పెట్రోల్ స్కూటర్లు ఎలక్ట్రికల్ గా మారాల్సిందే.

అయితే ఎలా?.

అదెలాగో బీబీసీ ప్రతినిధి రూపర్ట్ వింగ్ ఫీల్డ్ హేయస్ ఈ వీడియోలో చెప్పారు..

‘మీరు ఈ బైక్‌ని కొంటే దానికి బ్యాటరీ ఉండదు. కాబట్టి దీన్ని తక్కువ ధరకే అమ్ముతారు. పైగా మీరు కంపెనీ బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. కాబట్టి దీని చార్జింగ్ అయిపోయినట్టు అన్పిస్తే ఇలాంటి చార్జింగ్ పాయింట్లకు వచ్చి ఫుల్ బ్యాటరీని మార్చుకోవచ్చు.

తైవాన్‌లో 10వేలకు పైగా ఇలాంటి చార్జింగ్ స్టేషన్లున్నాయి. అందులో 10లక్షలకు పైగా బ్యాటరీలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన పనేలేదు’’ అంటున్నారు హేయస్.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)