ఇరాన్:యాంకర్ వార్తలు చదువుతుండగా స్టూడియో సమీపంలో పేలుడు, ఆ దేశ ప్రభుత్వ మీడియా భవనాలపై దాడి చేశామని ప్రకటించిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ తమపై దాడి చేసిందని ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ న్యూస్ నెట్‌వర్క్ తెలిపింది.

దాడి జరిగిన కొన్ని నిమిషాలకు ఆఫ్ ఎయిర్ అయిన ప్రభుత్వ టీవీ ప్రసారాలు కాసేపటి తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి.

తమ అన్ని కార్యక్రమాలను ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని ప్రభుత్వ టీవీ చానల్ స్క్రీన్‌పై టెక్ట్స్‌లో చూపిస్తున్నారు.

అదే చానల్ మరో స్క్రోలింగ్‌లో ఇరాన్ ప్రభుత్వ టీవీ భవనాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసిందని చెప్పారు.

ఇజ్రాయెల్ తన దాడులతో నిజం గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్ చెప్పింది.

ఇరాన్ ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్స్ త్వరలోనే మాయం కాబోతున్నాయని అంతకు ముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)