బృహస్పతి మీదకు అంతరిక్ష నౌక

బృహస్పతి మీదకు అంతరిక్ష నౌక

యూరోపియన్ అంతరిక్ష సంస్థ జూపిటర్...అంటే గురుగ్రహం మీదకు అంతరిక్షనౌకను పంపించే ప్రతిష్టాత్మక ప్రయోగం వాయిదా పడింది.

వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన ఈ ప్రయోగం నిలిపివేశారు.

జూపిటర్‌ ఉపగ్రహాల మీద జీవం ఉందా లేదా అనేది కనిపెట్టడమే ఈ మిషన్ లక్ష్యం.

ఈ అంతరిక్ష నౌకను జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్‌.. సంక్షిప్తంగా జ్యూస్ అని పిలుస్తున్నారు.

స్పేస్‌క్రాప్ట్ ఆ ఉపగ్రహాలను చేరుకోవడానికి ఎనిమిదేళ్లు పడుతుంది. బృహస్పతి చుట్టూ తిరిగే ఉపగ్రహాల ఉపరితలం కింద ద్రవరూప సముద్రాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

బీబీసీ ప్రతినిధి రెబెకా మొరేల్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి: