You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పారిస్ ఒలింపిక్స్: బరిలో రితికా, దీక్షా దగర్, ఇవాళ్టి భారత షెడ్యూల్ ఇదే..
పారిస్ ఒలింపిక్స్‌లో 14వ రోజు ముగిసింది, భారత పోరాటం చివరి దశకు వచ్చింది. శుక్రవారం రాత్రి రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్యం గెలిచి, భారత్ ఖాతాలో మరో పతకం చేర్చారు.
పురుషుల, మహిళల 4x400 మీటర్ల రిలేలో భారత అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో ట్రాక్, ఫీల్డ్ పోటీలలో ఇక భారత పతకం ఆశలు ముగిసినట్లే.
ఈ ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరింది. టోర్నీకి ఆగస్ట్ 11 చివరి రోజు.
ఈ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో షూటర్ మను భాకర్‌తో హాకీ జట్టు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ ఇండియన్ ఫ్లాగ్ బేరర్‌గా ఉండనున్నారు. శ్రీజేష్‌ను ఎంచుకోవడం సంతోషంగా ఉందని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది.
మను భాకర్ రెండు రోజుల కిందటే భారత్ వచ్చారు. కానీ, ముగింపు వేడుకల్లో ఫ్లాగ్ బేరర్‌గా ఎంపికవడంతో తిరిగి పారిస్ వెళ్లనున్నారు.
మను భాకర్‌తో జెండాను పట్టుకునేందుకు నీరజ్ చోప్రాను మొదట ఎంపిక చేసినా, తర్వాత ఆయన అనుమతితో శ్రీజేష్‌కు అవకాశం ఇచ్చారు. శ్రీజేష్ హాకీ నుంచి రిటైర్మైంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
పారిస్ ఒలింపిక్స్‌లో ఇవాళ్టి (ఆగస్టు 10) భారత షెడ్యూల్..
గోల్ఫ్:
- మహిళల వ్యక్తిగత ఫైనల్: అదితి అశోక్, దీక్షా దాగర్
- సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు
రెజ్లింగ్:
- మహిళల ఫ్రీస్టైల్ 76 కేజీల ప్రీ-క్వార్టర్ ఫైనల్స్: రితికా హుడా వర్సెస్ బెర్నాడెట్ నాగి (హంగేరి)
- సమయం: మధ్యాహ్నం 2.51 గంటలకు
- క్వార్టర్ ఫైనల్స్ (అర్హత సాధిస్తే):
- సమయం: సాయంత్రం 4.20 గంటలకు
- సెమీఫైనల్స్ (అర్హత సాధిస్తే):
- సమయం: రాత్రి 10.20 గంటలకు
పతకాలు సాధించిన భారత క్రీడాకారులు ఎవరు?
పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్‌కు ఒక రజతం, ఐదు కాంస్యాలు వచ్చాయి.
మూడు కాంస్యాలు షూటింగ్‌లో రాగా, ఒకటి పురుషుల హాకీలో, మరొకటి రెజ్లింగ్‌లో లభించింది.
జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ రజతాన్ని గెలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ మెడల్.
షూటింగ్‌లో ఒక కాంస్యం మను భాకర్ వ్యక్తిగత విభాగంలో గెలుచుకోగా, సరబ్‌జ్యోత్‌తో కలిసి మరొకటి గెలిచారు, మూడో కాంస్యం మరో షూటర్ స్వప్నిల్ కుసాలె సాధించాడు. రెజ్లింగ్‌లో అమన్ కాంస్యం గెలిచాడు.
BBC ISWOTY ఎమర్జింగ్ వుమన్ ప్లేయర్ అవార్డు
2021లో బీబీసీ ప్రదానం చేసిన ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాల్లో మను భాకర్ ‘ఎమర్జింగ్ వుమన్ ప్లేయర్- 2020’ అవార్డును అందుకున్నారు.
దేశం కోసం మరిన్ని పతకాలు సాధించేందుకు బీబీసీ అవార్డు ప్రేరణ ఇస్తుందని అప్పుడు ఆమె అన్నారు.
ఇప్పటి వరకు ఏ దేశానికి ఎన్ని పతకాలు వచ్చాయో ఈ పట్టికలో చూడొచ్చు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)