హైదరాబాద్ - విజయవాడ హైవేపై మంటల్లో కాలిపోయిన ట్రావెల్స్ బస్సు

హైదరాబాద్ - విజయవాడ హైవేపై మంటల్లో కాలిపోయిన ట్రావెల్స్ బస్సు

హైదరాబాద్ – విజయవాడ హైవేపై ఓ ప్రైవేట్ బస్సు కాలిపోయింది.

ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో నవంబర్ 10 అర్ధరాత్రి జరిగింది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న ఈ బస్సులోని 29 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ముందస్తుగా బస్సు సిబ్బంది అలర్ట్ చేయడంతో ప్రయాణికులు బస్సు దిగిపోయారు. ఇంజిన్‌లో మంటలు రావడంతో ప్రమాదం జరిగినట్లుగా బస్సు డ్రైవర్ తెలిపారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)