You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పార్లమెంటుపై దాడికి 21 ఏళ్లు: మిలిటెంట్ల దాడి నుంచి భారత ప్రధాని, ఎంపీలు ఎలా బయటపడ్డారంటే
న్యూదిల్లీ, 2001 డిసెంబర్ 13.
ఉదయం 11 గంటలకు రాజధాని అంతటా గోరువెచ్చటి ఎండ కాస్తోంది.దేశ పార్లమెంటులో విపక్షాల హంగామా మధ్య శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి గత కొన్నిరోజులుగా సభలో కలకలం కొనసాగుతోంది.పార్లమెంటు పరిసరాల్లో ఉన్న జర్నలిస్టులు, కెమెరామెన్లు దేశ నేతల రాజకీయాలు, బయటి విషయాల గురించి పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు.
పార్లమెంటులో ఆ సమయంలో ఎంతోమంది ఎంపీలతోపాటూ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రతిపక్ష నేత సోనియాగాంధీ కూడా ఉన్నారు.
తర్వాత 11.02 నిమిషాలకు లోక్‌సభ వాయిదా పడింది. ప్రధాని వాజ్‌పేయి, సోనియాగాంధీ తమ తమ వాహనాల్లో పార్లమెంటు నుంచి బయల్దేరారు.పార్లమెంటు నుంచి వచ్చే ఎంపీలను తీసుకువెళ్లడానికి గేట్ల బయట ప్రభుత్వ వాహనాల హడావుడి మొదలైంది.
ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ కాన్వాయ్ కూడా పార్లమెంటు గేట్ నంబర్ 12 దగ్గర బయల్దేరడానికి సిద్ధంగా ఉంది.
కారును గేటు దగ్గరికి తీసుకొచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఉపరాష్ట్రపతి రాక కోసం ఎదురుచూస్తున్నారు.
11.30 అవుతోంది. ఉపరాష్ట్రపతి సెక్యూరిటీ సిబ్బంది ఇంకా ఆయన తెల్ల అంబాసిడర్ కారు దగ్గర నిలబడి ఉన్నారు.
అప్పుడే DL-3CJ-1527 నంబరున్న ఒక తెల్ల అంబాసిడర్ కారు వేగంగా గేట్ నంబర్ 12 వైపు దూసుకెళ్లింది.
ఉపరాష్ట్రపతి కారును ఢీకొనగానే అందులోంచి దిగిన మిలిటెంట్లు విచక్షణారహితంగా ఫైరింగ్ ప్రారంభించారు. మిలిటెంట్ల చేతుల్లో ఏకే 47, హ్యాండ్ గ్రెనేడ్ లాంటివి ఉన్నాయి..
భారత పార్లమెంటుపై మిలిటెంట్లు దాడిచేసి 21 ఏళ్లవుతోంది.. ఆ రోజు ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి..
ఇవి కూడా చదవండి:
- అఫ్గాన్ మహిళల రహస్య కథలు: ‘కొన్ని కలలు కనడానికి కూడా మాకు అనుమతి ఉండదు’
- మసాయి ఒలింపిక్స్: సింహాలను వేటాడే వీరులు ఆడే ఆటలు
- పని కోసం ఖతార్ వెళ్తే తిరిగి రావడం కష్టమా, పని మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి
- గుజరాత్ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకే ఓటు వేశారా, ఈ వాదనల్లో నిజమెంత?
- ఇషాన్ కిషన్: ‘అతనొక భయం తెలియని ఆటగాడు’... విరాట్ కోహ్లీ ఈ మాట ఎందుకన్నాడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)