You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వరద తీవ్రతను కళ్లకు కడుతున్న ఐదు ఫొటోలు
- రచయిత, అహ్మెన్ ఖవాజా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అఫ్గానిస్తాన్‌లో కొన్ని ప్రాంతాలను ముంచెత్తిన వరదల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయాలు. పలు ఇళ్లు కొట్టుకుపోయాయి.
కొన్ని వారాలుగా అఫ్గానిస్తాన్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి.
ఉత్తర అఫ్గానిస్తాన్‌లో కురిసిన ఆకస్మిక భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో 315 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. సుమారు 1,600 మందికి పైగా ఈ వరదల వల్ల గాయపడినట్లు పేర్కొన్నారు.
భారీ వరదలకు వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని, పశువులు చనిపోయాయని తాలిబాన్ పాలిత రెఫ్యూజీ మినిస్ట్రీ చెప్పింది.
వైద్య సదుపాయాలు, మంచినీరు వంటి కనీస అవసరాలకు సైతం కొందరు స్థానికులు ఇబ్బంది పడుతున్నట్లు సహాయక బృందాలు చెప్పాయి.
అఫ్గానిస్తాన్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లులో బురద మట్టి పేరుకుపోయింది.
బగ్లాన్ ప్రావిన్స్‌లోని ఐదు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
మృతుల్లో చాలా మంది బోర్కా జిల్లాకు చెందిన వారు.
ఈ జిల్లాలో 200 మందికి పైగా ప్రజలు బయటికి రాలేక ఇళ్లలోనే చిక్కుకుపోయారు.
బదక్షాన్, ఘోర్, హెరత్ ప్రావిన్స్‌లలో తీవ్ర నష్టం జరిగినట్లు పలు రిపోర్టులు వచ్చాయి.
పర్యావరణ మార్పుల వల్ల ప్రపంచంలో ఎక్కువగా ప్రభావితమవుతున్న దేశాలలో అఫ్గానిస్తాన్ ఒకటి అని యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (ఓచా) పేర్కొంది.
2021 ఆగస్టులో తాలిబాన్లు అఫ్గానిస్తాన్ పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఇతర దేశాల నుంచి అఫ్గాన్‌కు అందే సహాయం, నిధులు చాలావరకు నిలిచిపోయాయి.
వరదల వల్ల ప్రభావితమైన ప్రాంతాలకు ఐక్యరాజ్యసమితి, మానవతా ఏజెన్సీలు, ప్రైవేట్ సంస్థలు సాయం చేయాలని తాలిబాన్ ఆర్థికమంత్రి దిన్ మొహమ్మద్ హనిఫ్ కోరారు.
వరదలకు ప్రభావిత జిల్లాల్లో 3,10,000 మంది పిల్లలు నివసిస్తున్నట్లు చారిటీ సేవ్ అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి:
- వేరే అభ్యర్థికి ఓటేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఏం జరిగిందంటే...
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: కొట్లాటలు, గాలిలోకి కాల్పులు, పెట్రోలు బాంబులు, ఈవీఎం ధ్వంసాలు, కిడ్నాపులు, సస్పెన్షన్లు.. పోలింగ్ రోజు ఏం జరిగిందంటే..
- ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరాక ఏం జరుగుతుంది, భద్రత ఎలా ఉంటుంది? లోపలికి ఎవరెవరు వెళ్లొచ్చు?
- బేరియాట్రిక్ సర్జరీ: బరువు తగ్గించుకునే ఆపరేషన్‌తో యువకుడి మృతి, అసలేం జరిగింది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)