ఆశా భోస్లే మరణం: తన ప్రతిభ, పట్టుదలతో లతా మంగేష్కర్ సింహాసనానికి సవాల్ విసిరిన గాయని

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, యాసిర్ ఉస్మాన్
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 2 నిమిషాలు
ప్రముఖ గాయని ఆశా భోస్లే ఆదివారం కన్నుమూశారు.
ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యులు ఈ విషయాన్ని బీబీసీ మరాఠీకి ధ్రువీకరించారు.
ఆశా భోస్లే శనివారం కార్డియాక్ అరెస్ట్‌కు గురవడంతో ఆసుపత్రిలో చేర్పించారు.
భారతీయ సంగీత ప్రపంచంలో ఒక గొప్ప గాయనిగా ఆమె పేరు పొందారు. ప్లే బ్యాక్ సింగర్‌గా ఆమె ఎన్నో మరపురాని పాటలను పాడారు.

మనుషులు దూరమైనా, కొన్ని గాత్రాలు మాత్రం చాలాకాలం పాటు బహుశా ఎప్పటికీ అలా నిలిచిపోతాయి.
'నయా దౌర్' నుంచి 'తీస్త్రీ మంచిల్' వరకు, 'హరే రామా హరే కృష్ణా' నుంచి 'ఉమ్రావ్ జాన్' వరకు 'ఇజాజత్' నుంచి 'రంగీలా' వరకు... కాలం మారింది, తరాలు మారాయి, వెండితెరపై హీరోయిన్లు మారారు. కానీ, ఆశా భోస్లే గొంతు మాత్రం ఎప్పటికీ నవ యవ్వనంగానే నిలిచిపోయింది.
(ఈ కథనం అప్డేట్ అవుతోంది)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































