You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒడిశా ఘోర రైల్వే ప్రమాదం ఫొటోలలో..
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. సౌత్ ఈస్ట్రన్ రైల్వే సమాచారం మేరకు ఇప్పటి వరకు 288 మందికి పైగా మరణించారు.
శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ఘోర రైలు ప్రమాదం జరిగింది.
ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు ప్రతి ఒక్కరూ ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద బాధితులకు అవసరమైన సాయం చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు.
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఈ రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి రాజీనామా చేయాలని టీఎంసీ లీడర్ అభిషేక్ బెనర్జీ డిమాండ్ చేశారు.
శుక్రవారం రాత్రి 7 గంటలకు ఈ ప్రమాదం జరగడంతో, చీకటిగా ఉండటంతో ఫోటోలు ఎక్కువగా బయటికి రాలేదు.
కానీ, తెల్లవారిన తర్వాత బయటికి వచ్చిన ఫోటోలలో ప్రమాద తీవ్రత కనిపిస్తోంది.
ఈ ప్రమాదం మూడు రైళ్ల మధ్య జరిగింది. దీనిలో రెండు ప్రయాణికుల ట్రైన్లు కాగా, ఒకటి గూడ్స్ రైలు.
ఈ ప్రమాదం చాలా భయకరంగా ఉంది. ప్రమాదం తర్వాత రైళ్ల బోగీలు చెల్లాచెదురయ్యాయి.
ఈ ప్రమాదంలో సుమారు 900 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
గాయాలు పాలైన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరగడంతో, కొందరు ప్రయాణికులు ఆ సమయంలో డిన్నర్ చేస్తున్నారు. ఆ టైమ్‌లో ఈ ప్రమాదం జరగడంతో, బోగీల వద్ద ప్రజల ఆహార పదార్థాలు, చెప్పులు పడి ఉన్నాయి.
తీవ్రంగా దెబ్బతిన్న బోగీలను మెషిన్లతో కట్ చేసి, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
బోగీల గ్లాస్‌లు, సీట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఈ రైలు ప్రమాదంలో గాయపడిన వారికి రక్తమందించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వస్తున్నారు.
ఎన్డీఆర్ఎఫ్, ఒడిశా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది బోగీలను కట్ చేసి లోపల ఉన్న వారిని వెలికి తీయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఒడిశా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జేనా తెలిపారు.
ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.
శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
‘‘ఈ ప్రమాదం దురదృష్టకరం. ప్రమాదం జరిగినట్లు తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాం’’ అని మంత్రి అశ్విని వైష్ణవ్ ఏఎన్ఐకి తెలిపారు.
బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ఏఎన్ఐ డ్రోన్ కెమెరా విజువల్స్..
ఒడిశాలో రైలు ప్రమాదం దురదృష్టకరమని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైల్వే అధికారులతో తాము మాట్లాడుతున్నామని, ఏపీలోని బాధితుల వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్-గ్రేషియాను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. గాయాలు పాలైన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల ఎక్స్-గ్రేషియాను అందించనున్నట్లు చెప్పారు.
ప్రమాదం జరిగినప్పుడు తాను దగ్గర్లో ఉన్నానని, 200 నుంచి 300 మంది వ్యక్తులను తాము కాపాడామని స్థానిక వ్యక్తి గణేష్ చెప్పారు.
ఈ రైలు ప్రమాదం తర్వాత పలు రైళ్లను రద్దు చేయగా, పలు రైళ్ల రాకపోకలు మార్చారు.
ఇవి కూడా చదవండి:
- ‘ది కేరళ స్టోరీ’: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్ని వేల మంది మహిళలు కనిపించకుండా పోయారు?
- కాలిఫోర్నియా: కుల వివక్ష నిషేధ చట్టాన్ని అమెరికాలో హిందూ సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
- రాహుల్ గాంధీ - బీజేపీ: జిన్నా ముస్లిం లీగ్‌కు, కాంగ్రెస్ మిత్రపక్షం ముస్లిం లీగ్‌కు మధ్య తేడా ఏమిటి?
- ‘అహింస’ రివ్యూ: డైరెక్టర్ తేజ మార్క్ కనిపించిందా? రామానాయుడి మనవడు అభిరామ్ నటన ఎలా ఉంది?
- జీడిమెట్ల: ‘ఈ నీరు కింద పడితే నేల ఎర్రగా మారిపోతోంది’.. హైదరాబాద్ శివార్లలోని భూగర్భ జలాన్ని బీబీసీ టెస్ట్ చేయిస్తే బయటపడిన వాస్తవం ఇదీ
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)