You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మాల్దీవుల వివాదంలో భారత్ పైచేయి సాధించిందా?
మాల్దీవులతో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య, భారత విదేశాంగ శాఖ అక్కడ ఉన్న భారత సైనికుల ఉపసంహరణకు సంబంధించిన కొత్త సమాచారాన్ని వెల్లడించింది.
మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత వారి స్థానంలో భారత సాంకేతిక బృందాన్ని (టెక్నికల్ టీమ్) అక్కడికి పంపిస్తామని గురువారం విలేఖరుల సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
మాల్దీవులతో ఏర్పడిన సమస్యలో మధ్యే మార్గాన్ని కనుగొనడంలో భారత్ విజయం సాధించిందని పలు ప్రపంచ దేశాల విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ భారతీయ సైనికులు ఉండకపోవచ్చు. కానీ, వారు చేసే పనిని భారత్ తమ టెక్నికల్ టీమ్‌తో కూడా చేయించగలదు.
మాల్దీవుల భౌగోళిక స్థానం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి అయ్యే చమురు మాల్దీవుల ద్వారా మాత్రమే వస్తుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు మాల్దీవులు వ్యూహాత్మకంగా ముఖ్యమైనది.
సంబంధాలు పరిమితికి మించి క్షీణించకుండా ఉండాలంటే సైనికుల బదలాయింపుకు మాల్దీపులు ఒప్పుకోవాల్సిన అవసరం ఉందని దిల్లీలోని జవహర్‌లల్ నెహ్రూ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ చైనీస్ స్టడీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరవింద్ యెల్లేరి అన్నారు.
భారత సైన్యం ఉపసంహరణ విషయంలో తొలుత మొండిగా ఉన్న మాల్దీవులు, ఇప్పుడు అక్కడ సైన్యంలో క్రియాశీలంగా లేని వ్యక్తుల మోహరింపునకు అంగీకరించడం చాలా పెద్ద విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- రాజ్యసభ ఎంపీలను ఎలా ఎన్నుకుంటారో తెలుసా?
- కొత్త మహాసముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
- వెన్నునొప్పి తగ్గడానికి పనికొచ్చే చికిత్సలేమిటి? ఫలితమివ్వని పద్ధతులేమిటి? నడుముకు బెల్ట్ వాడడం వల్ల ప్రయోజనం లేదా
- చేపలు తినేవారి మెదడు పెద్దగా ఉంటుందా... చెరువు, సముద్రం చేపల్లో ఏవి మంచివి?
- ముఖంపై ముడతలను, మచ్చలను కొల్లాజెన్ సప్లిమెంట్లతో తగ్గించుకోవచ్చా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.