‘పని’ చేయకుండా మనీ సంపాదించడం ఎలా?

38 ఏళ్ల సజన్ దేవ్‌షి, బ్రిటన్‌లోని లీస్టర్‌షైర్‌లో ఉంటున్నారు. 2020లో కరోనా సమయంలో లాక్‌డౌన్ విధించినప్పుడు తొలిసారిగా పాసివ్ ఇన్‌కమ్ గురించి విన్నట్లు చెప్పారు.

ఆ సమయంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉన్నారు. కొద్దిపాటి శ్రమ, చాలా తక్కువ శ్రమ, ప్రయత్నంతో డబ్బు సంపాదించడం ఎలా అని అనేకమంది ఫేస్‌బుక్‌లో పోస్టులు రాయడం, టిక్‌టాక్‌లో వీడియోలు రాయడాన్ని దేవ్‌షి గమనించారు.

‘కొంచెం శ్రమ, చిన్న మొత్తంలో పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి నడిపించాలనే ఆలోచన నాకు కూడా నచ్చింది. దీనర్ధం నా పనులు చేసుకుంటూనే నాకు అవసరమైన డబ్బు సంపాదించుకోవడం’ అని దేవ్షి చెప్పారు.

ఈ ఆలోచనతోనే ఆమె రాత్రి పూట పిల్లలు నిద్ర పోయిన తర్వాత విద్యా రంగంలో పని చెయ్యడం మొదలు పెట్టారు. దీనినే నిపుణులు పాసివ్ ఇన్‌కమ్ అని పిలుస్తున్నారు. దీనర్ధం తక్కువ శ్రమతో డబ్బు సంపాదించడం అని.

రాంచీలో బ్యాంకు ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన మనీష్ వినోద్, ప్రస్తుతం ఆర్థిక సలహాదారుగా పని చేస్తున్నారు. పాసివ్ ఇన్‌కమ్ గురించి ఆయన ఏం చెబుతున్నారంటే “ మొదట మీరు కాస్త క్రియాశీలకంగా ఉండి ఏదైనా పని లేదా వ్యాపారం ప్రారంభించాలి. కొన్ని రోజుల తర్వాత దాని నుంచి మీకు ఆదాయం రావడం మొదలవుతుంది. అలా ప్రతీ రోజూ వచ్చే డబ్బుని మీరు ఆ వ్యాపారం కోసమే పెట్టుబడి పెట్టాలి. మీరు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు. మీరు చేసే పని ఆటోమోడ్‌లోకి వస్తుంది.”

దీనిని రెండో దశ ఆత్మరక్షణ విధానంగా చెబుతున్నారు వినోద్. “మీ కోసం, మీ కుటుంబం భవిష్యత్ అవసరాల కోసం ప్రధాన ఆదాయాన్ని కోల్పోయినప్పుడు ఉపయోగ పడే సాధనమే పాసివ్ ఇన్‌కమ్” అని వినోద్ చెప్పారు.

కరోనా లాక్‌డౌన్

గతంలో సంపన్నులకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉండేది. ఎందుకంటే వారి వద్ద ఉన్న డబ్బుతో ఇళ్లు, స్థలాలు కొని వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం సంపాదించేవారు. అయితే కరోనా కాలంలో లాక్‌డౌన్ పెట్టినప్పుడు పాసివ్ ఇన్‌కమ్ అనే పదానికి అర్థం పూర్తిగా మారిపోయింది. ఆ సమయంలో యువకులు, ముఖ్యంగా మిల్లీనియల్స్ అదనపు ఆదాయం సంపాదించేందుకు అనేక మార్గాలను కనుక్కున్నారు.

ఉద్యోగాల్లో ఉండే సవాళ్లు, సామాజిక మాద్యమాల ప్రభావంతో ప్రజల మీద పాసివ్ ఇన్‌కమ్ ప్రభావం బాగా పెరిగింది.

అమెరికన్ సెన్సస్ బ్యూరో అంచనాల ప్రకారం అమెరికాలోని 20 శాతం ప్రజలు ఇలాంటి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వారి ఏడాది సగటు ఆదాయం 4200 డాలర్లు. అలాగే అమెరికన్ యువతలో 35 శాతం తేలికైన మార్గంలో సంపాదిస్తున్నారు.

ఈ ట్రెండ్ భారత దేశంలోనూ పెరుగుతోంది.

అయితే భారత దేశంలో పాసివ్ ఇన్‌కమ్ ఆర్జిస్తున్న వారెంత మంది అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే అనేక మంది తమ ఆదాయ వివరాలను వెల్లడించడం లేదంటున్నారు మనీష్ వినోద్.

డెలాయిట్ గ్లోబల్ 2022 జనరేషన్ జెడ్ అండ్ మిలేనియల్ సర్వే ప్రకారం భారతదేశంలో 62 శాతం జనరేషన్ జెడ్, 51 శాతం మిలేనియల్స్ వేరే ఉద్యోగం చేస్తూ పాసివ్ ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు.

తన వద్ద ఎలాంటి అధికారిక డేటా లేకున్నప్పటికీ భారత దేశంలో ఈ ట్రెండ్ పెరుగుతోందని మంబయికి చెందిన వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు కౌస్తుబ్ జోషి కూడా చెబుతున్నారు.

“పర్సనల్ ఫైనాన్స్ విషయానికొస్తే డబ్బులు ఎలా పెట్టుబడి పెట్టాలి?. అనే విషయాలు మాత్రమే కాదు. పాసివ్ ఇన్‌కమ్ కోసం ఇంకా ఏవైనా మార్గాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. వాళ్లకు ఇలాంటి అంశాలు తెలుసుకోవడంలో చాలా ఆసక్తి ఉండటం నేను గమనించాను” అని ఆయన చెప్పారు.

సోషల్ మీడియా ప్రభావం

మీరు డబ్బు ఎలాం సంపాదించగలరు అని చెప్పేందుకు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వేల కొద్దీ వీడియోలు అందుబాటులో ఉన్నాయి.

అలాంటి వీడియోల వల్ల యువతలో పాసివ్ ఇన్‌కమ్ వల్ల ఆసక్తి పెరుగుతోందని బ్రిటన్‌లోని లీడ్స్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్‌లో బోధిస్తున్న ప్రొఫెసర్ శంఖ బసు చెప్పారు.

సోషల్ మీడియాలో పాసివ్ ఇన్‌కమ్ ఆర్జిస్తున్న వారు సాధించిన విజయగాధల్ని వింటున్న వారు వాటి నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. అలా స్ఫూర్తి పొంది విజయం సాధించిన వారు కూడా తాము ఎలా డబ్బు ఆర్జిస్తున్నామో సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇలా ఇదొక సైకిల్‌గా మారింది.

పాసివ్ ఇన్‌కమ్ వల్ల ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక స్వేచ్చ లభిస్తుందని ప్రజలు భావిస్తున్నట్లు జనరేషన్ మనీ ఆండ్ పర్సనల్ ఫైనాన్స్ నిపుణుడు అలెక్స్ కింగ్ చెబుతున్నారు.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు కూడా ప్రజల్ని ఆ దిశగా ఆలోచించేలా చేస్తున్నాయనేది ఆయన భావన. “ దశాబ్ధ కాలంగా ప్రజల ఆదాయాల్లో పెద్దగా పెరుగుదల లేదు. అనేక మంది యువకులు అధ్వాన్న పరిస్థితుల మధ్య పని చేస్తున్నారు. సంస్థలు కూడా వారితో ఎక్కువ సమయం పని చేయిస్తున్నాయి.” అని ఆయన చెప్పారు.

“పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దైనందిన ఖర్చుల్లో పెరుగుదల కారణంగా యువకుల్లో ఎక్కువ మంది పాసివ్ ఇన్‌కమ్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఎందుకంటే వాళ్లు చేస్తున్న ఉద్యోగాల్లో వారు ఎక్కువ పని గంటలు పని చేసినా ఆదాయం ఆ స్థాయిలో పెరగడం లేదు” అని శంఖబసు చెప్పారు.

కోవిడ్ సమయంలో లాక్‌డౌన్ కారణంగా చాలా మంది తమ ఉద్యోగాల విషయంలో కొనసాగాలా వద్దా అనే స్వేచ్చ తమకే ఉండాలని భావించారు. కోవిడ్ టైమ్‌లోనే కొత్త టెక్నాలజీ, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి యువతకు సమయం, అవకాశం దొరికేంది.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల మధ్య ఉద్యోగం లేదా వ్యాపారంతో పాటు అదనపు ఆదాయం ఉండటం అవసరం అనే భావన యువత మధ్య విస్తృతంగా పెరుగుతోందని కింగ్ చెప్పారు.

భారత దేశంలో ఎలా ఉంది?

పాసివ్ ఇన్‌కమ్ కోసం దేశంలో కొంతమంది ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగం చేస్తూనే బ్లాగర్లుగా మారారు. మరికొంతమంది డెలివరీ బాయ్స్ అవతారమెత్తారు. షేర్ మార్కెట్‌పై అవగాహన పెంచుకుని షేర్లు కొనడం, అమ్మడం కూడా ప్రారంభించారని మనీష్ వినోద్ చెప్పారు కింగ్ చెప్పారు.

మీ ఆస్తిని అద్దెకు ఇవ్వడం డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గం. కరోనా సమయంలో ఆన్‌లైన్ తరగతుల ట్రెండ్ బాగా పెరిగింది.

వేరే ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ టీచింగ్‌ని ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుని తమ అభిరుచిని నెరవేర్చుకోవడమే కాకుండా అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

కోవిడ్ సమయంలో 0చాలా మంది పుస్తకాలు రాశారు. వాటిని ప్రచురించి డబ్బు సంపాదించారు. యూట్యూబ్ ఛానల్‌లో కుకరీ క్లాసులతో మహిళలు డబ్బు సంపాదిస్తున్నారు. కోవిడ్‌కు ముందుతో పోలిస్తే తర్వాత యూట్యూబర్లు, రకరాల యూట్యూబ్ ఛానల్స్ సంఖ్య భారీగా పెరిగిందని మనీష్ వినోద్ చెప్పారు.

కరోనా సమయంలో బాగా పాపులర్ అయిన మరో వ్యాపారం డ్రాప్ షిప్పింగ్. ఇది చాలా తక్కువ పెట్టుబడితో చెయ్యగలిగే ఆన్‌లైన్ వ్యాపార నమూనా. ఇందులో మీరు చాలా వస్తువులను కొనుగోలు చేసి వాటిని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఏదైనా తయారు చేసినా అది అమ్ముడవతుందా లేదా అని బాధ పడాల్సిన అవసరం కూడా లేదు.

ఇందులో మీరు సరఫరాదారు నుండి వస్తువులను తీసుకొని నేరుగా అవసరమైన వారికి అందిస్తారు.

మీరు చేయాల్సిందల్లా ఆన్‌లైన్ స్టోర్ తెరవడమే. అందులో వస్తువుల సరఫరాదారులతో టై అప్ కావాలి.

మీకు ఆర్డర్ వచ్చిన వెంటనే ఆ వస్తువును సరఫరాదారు నుండి తీసుకొని కొనుగోలుదారుకు ఆన్‌లైన్‌లో అమ్మవచ్చు. షేర్లు కొనడం, అమ్మడం కాడ ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించగల వ్యాపారం.

“గత 5ఏళ్లలో ఆన్‌లైన్ పోర్టల్స్, ఇన్‌స్టాగ్రామ్, ఖాతాలు, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల సహాయంతో డబ్బు సంపాదించడం నేను చూశాను.” అని కౌస్తుబ్ జోషి చెప్పారు.

యూట్యూబ్ చాలా మందికి మొదటి ఆదాయ వనరుగా మారుతున్న మాట నిజమే, కానీ చాలా మంది ఇప్పటికీ దీనిని పాసివ్ ఇన్‌కమ్‌గా చూస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ యువతకు సులభమైన మార్గాన్ని అందించింది.

పాసివ్ మనీ విషయంలో కొంతమంది ఆదాయం ఆర్జిస్తున్నా.. అందరూ ఇందులో విజయం సాదిస్తారని గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. చాలా మందికి అలాంటి కల కలగానే మిగిలిపోతుంది. వాస్తవానికి, సోషల్ మీడియా ప్రభావశీలులుగా ఎదగడం కనిపించేంత సులభం కాదు.

విద్యార్ధులకు వారి పరీక్షలలో సహాయం చేయడానికి దేవ్షి విద్యా వనరుల వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అయితే అది ఆయన అనుకున్నంత తేలిగ్గా జరగలేదు.

ఏదైనా ప్రాజెక్ట్‌ని స్థాపించడానికి చాలా శ్రమ, సమయం తీసుకుంటుందని, ఆ తర్వాత పాసివ్ ఇన్‌కమ్ రావడం మొదలవుతుందని, అందుకే అదనపు ఆదాయం సంపాదించడం అంత తేలిక్కాదని దేవ్‌షి చెప్పారు.

ఎక్కువ మంది పాసివ్ ఆదాయాన్ని సంపాదిస్తే, యువత డబ్బు సంపాదించే మార్గాలు మారవచ్చు. ప్రజల ఆలోచనా ధోరణి మారింది. అదనపు ఆదాయం ధనవంతులకే కాదు. డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచన కూడా మారుతోంది.

ఎక్కువ మంది పాసివ్ ఆదాయాన్ని సంపాదిస్తే, యువత డబ్బు సంపాదించే మార్గాలు మారవచ్చు. ప్రజల ఆలోచనా ధోరణి మారింది. అదనపు ఆదాయం ధనవంతులకే కాదు. డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచన కూడా మారుతోంది.

జాగ్రత్తలు తప్పనిసరి

పాసివ్ ఇన్‌కమ్ విషయంలో ప్రజల ఆలోచనా ధోరణి మారింది. అనేకమంది దీనిని సమర్థిస్తున్నారు.

అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కౌస్తుభ్ జోషి చెబుతున్నారు. "ప్రజలు డబ్బు సంపాదించే క్రమంలో పాసివ్ ఇన్‌కమ్ అనే దాని మీదనే ఆధారపడటం సరైనది కాదు." అని ఆయన చెప్పారు.

“చాలా మంది తమ ఆఫీసు పనిని పట్టించుకోకుండా తమ అదనపు సంపాదనపై దృష్టి పెట్టడాన్ని నేను చూశాను, ఈ ప్రయత్నం తప్పు. ఇది మీ రెండు ఆదాయ వనరులను ప్రభావితం చేయవచ్చు.”

‘‘ఈ రోజుల్లో అదనపు ఆదాయం సంపాదించడం ప్రతి ఒక్కరి కోరిక, కానీ అందుకోసం మీరు ఎక్కువ సమయం కేటాయించి, మీరు, మీ కుటుంబంతో గడిపే సమయాన్ని నష్టపోతుంటే దాని గురించి ఆలోచించాలి. డబ్బు సంపాదించడం మీ ప్రధాన లక్ష్యం, కానీ అది మీ అంతిమ లక్ష్యం కాకూడదు.” అని కౌస్తుబ్ జోషి చెప్పారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)