You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్: అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ కొన్న ఈ సంస్థ గురించి మీకేం తెలుసు?
- రచయిత, రాఘవేంద్రరావు, షాదాబ్ నజ్మీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఎలక్టోరల్ బాండ్స్‌కు సంబంధించిన డేటాను ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ డేటాను ఎన్నికల సంఘానికి అందించింది.
ఈ డేటా ప్రకారం ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లు కొన్న సంస్థగా నిలిచింది.
2020 అక్టోబర్ నుంచి జనవరి 2024 మధ్య ఈ సంస్థ 1368 కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది.
గతంలో ఈ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసినప్పుడు కూడా ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చర్చ జరిగింది.
2021 అక్టోబర్‌లో ఈ సంస్థ 195 కోట్ల రూపాయలు, 2022 జనవరిలో రెండుసార్లు 210 కోట్ల రూపాయల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది.
ఈ ఏడాది జనవరిలో కూడా 63 కోట్ల రూపాయలు చెల్లించి ఎలక్టోరల్ బాండ్లు తీసుకుంది.
ఈ డేటా ప్రకారం ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లు కొన్న సంస్థగా నిలిచింది.
2020 అక్టోబర్ నుంచి జనవరి 2024 మధ్య ఈ సంస్థ 1368 కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది.
గతంలో ఈ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసినప్పుడు కూడా ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చర్చ జరిగింది.
2021 అక్టోబర్‌లో ఈ సంస్థ 195 కోట్ల రూపాయలు, 2022 జనవరిలో రెండుసార్లు 210 కోట్ల రూపాయల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది.
ఈ ఏడాది జనవరిలో కూడా 63 కోట్ల రూపాయలు చెల్లించి ఎలక్టోరల్ బాండ్లు తీసుకుంది.
ఫ్యూచర్ గేమింగ్ గురించి మీకు ఏం తెలుసు?
ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 1991 డిసెంబర్ 30న ఏర్పడింది.
సంస్థ రిజిస్ట్రేషన్ అడ్రస్ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంది. అయితే సంస్థ అకౌంట్లు, లెక్కలకు వ్యవహారాలు మాత్రం కోల్‌కతా కేంద్రంగా నడుస్తున్నాయి. కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నప్పటికీ ఈ సంస్థ ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కాలేదు.
కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం ప్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో మార్టిన్ లాటరీ ఏజన్సీస్ పేరు మీద నడిచింది.
భారతదేశంలోని లాటరీ పరిశ్రమలో ఈ సంస్థ టర్నోవర్ రెండు బిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో 1.65 లక్షల కోట్లకు పైనే.
“ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లాటరీలను అనుమతిస్తున్న రాష్ట్రాలలో విస్తృత స్థాయిలో డీలర్లు, ఏజెంట్లతో కలిసి నెట్‌వర్క్ ఏర్పరచుకుంది. లాటరీ వ్యాపారంలో అందరి కంటే ముందుండేందుకు నిరంతరం మార్కెట్ అధ్యయనం చేస్తున్నాం” అని కంపెనీ వెబ్‌సైట్ చెబుతోంది.
1991లో సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఫ్యూచర్ గేమింగ్ వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు కాగితాలతో చేసిన లాటరీ టిక్కెట్లు అమ్మకాలు మొదలు పెట్టిన తర్వాత ఫ్యూచర్ గేమింగ్ వేగంగా ఎదిగింది.
“ఇదంతా కాంపిటీటివ్ బిడ్డింగ్, దేశంలోని అనేక రాష్ట్రాలలో సమర్ధవంతమైన లాటరీల నిర్వహణ, దూకుడు మార్కెటింగ్ విధానాలు, అభివృద్ధి దిశగా ఉత్సాహపూరిత అడుగుల వల్లే సాధ్యమైంది”
2001 నుంచి ఫ్యూచర్ గేమింగ్ కంపెనీకి వరల్డ్ లాటరీ అసోసియేషన్, ఏషియా ఫసిఫిక్ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉంది.
శాంటియాగో మార్టిన్ ఎవరు?
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం శాంటియాగో మార్టిన్ ఈ సంస్థకు ఛైర్మన్. మార్టిన్‌ను లాటరీ కింగ్ అని పిలుస్తారు.
మార్టిన్ 13 ఏళ్లకే లాటరీ వ్యాపారంలో అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఆయన దేశవ్యాప్తంగా లాటరీలు అమల్లో ఉన్న రాష్ట్రాలలో విస్తృతమైన నెట్ వర్క్ ఏర్పాటు చేశారు. దేశంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లించిన వ్యక్తిగా మార్టిన్‌కు అనేకసార్లు అవార్డు దక్కిందని సంస్థ వెబ్ సైట్ చెబుతోంది.
లాటరీ వ్యాపారాన్ని ప్రారంభించక ముందు ఆయన మియన్మార్‌లోని యాంగూన్‌లో కూలీగా జీవితాన్ని మొదలు పెట్టాడు. కూలీగా ఉన్న సమయంలో ఆయన సంపాదన కుటుంబానికి సరిపడేది కాదు. “భారత్ వచ్చిన తర్వాత 1988లో తమిళనాడులో లాటరీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. తర్వాత దాన్ని కర్నాటక, కేరళకు విస్తరించాడు అని ని మార్టిన్ చారిటబుల్ వెబ్‌సైట్ చెబుతోంది.
ఫ్యూచర్ గేమింగ్ మీద ఈడీ దాడులు
చెన్నైలోని శాంటియాగో మార్టిన్ నివాసం, కోయంబత్తూర్‌లోని ఆఫీసు కార్యాలయం, ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇతరుల మీద నిరుడు మేలో 11,12న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఫ్యూచర్ గేమింగ్ సంస్థ మనీ లాండరింగ్‌కు పాల్పడిందనే ఆరోపణల కింద ఈ దాడులు చేపట్టినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో 457 కోట్ల స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మరో 15 కంపెనీల మీద నిరుటి సెప్టెంబర్ 21న కోల్‌కతాలోని స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసులో కోర్టు అభియోగాలను నమోదు చేసింది.
ఐపీసీ, లాటరీ నియంత్రణ చట్టం 1988లోని పలు సెక్షన్ల కింద ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ మీద పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు విచారణ మొదలు పెట్టారు.
ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీ దేశవ్యాప్తంగా తమ లాటరీ టిక్కెట్లను అమ్మేందుకు వివిధ రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తమ విచారణలో తేలినట్లు ఈడీ తెలిపింది.
ఒప్పందం ప్రకరారం లాటరీ టిక్కెట్ల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంలో రాష్ట్రాల వాటా డిపాజిట్ చెయ్యకుండా ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మోసం చేసిందని ఈడీ ఆరోపించింది.
అమ్ముడుపోని లాటరీ టిక్కెట్లను దాచి పెట్టడం. ఆ టిక్కెట్లకు లాటరీ తగిలినట్లు చెప్పుకోవడం, అమ్ముడు కాని టిక్కెట్లను అమ్మినట్లు చూపించి ఆ టిక్కెట్లకే లాటరీ తగిలిందని చూపించి.. బహుమతి సొమ్మంతా తీసుకోవడం ఈ సంస్థ కార్యకలాపాల్లో అలవాటుగా మారిందని ఈడీ ఆరోపించింది. ఇది లాటరీ నియంత్రణ చట్టం 1988కి పూర్తిగా విరుద్దం.
శాంటియాగో మార్టిన్ అల్లుడు ఆదవ్ అర్జున్ ఆస్తుల మీద ఈ ఏడాది మార్చ్ 9న ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మనీ లాండరింగ్ కింద వచ్చిన సొమ్ము, తమిళనాడులో ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా అతను ఆస్తులు సంపాదించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- గీతాంజలి ఆత్మహత్య: 'ఆ రోజున ఇంటర్వ్యూ ఇవ్వకపోయి ఉంటే బతికి ఉండేది...' ట్రోలింగ్ బాధితురాలి మృతిపై ఎస్పీ తుషార్ ఇంకా ఏమన్నారు?
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- సుద్ద పొడికి కవర్ చుట్టి, బ్రాండ్ వేసి, ట్యాబ్లెట్లుగా అమ్మేస్తున్నారు..
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- స్కార్లెట్ ఫీవర్: ఈ జ్వరం పిల్లలకు ప్రాణాంతకమా? లక్షణాలు, చికిత్స ఏమిటి
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)