You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈజిప్ట్: క్లాడియస్ చక్రవర్తిని పోలిన స్పింక్స్
- రచయిత, ఎమిలీ మెక్‌గార్వీ
- హోదా, బీబీసీ న్యూస్
దక్షిణ ఈజిప్ట్‌లోని ఓ పురాతన ఆలయంలో ఆర్కియాలజిస్ట్‌లు ఒక మందిరం అవశేషాలతో పాటు స్పింక్స్ లాంటి విగ్రహం ఒకటి తవ్వితీశారు.
ఈజిప్ట్‌లో భద్రంగా కాపాడుకుంటూ వస్తున్న పురావస్తు ప్రాంతాల్లో ఒకటైన హథోర్ ఆలయం సమీపంలో ఇవన్నీ లభించాయి.
లైమ్‌స్టోన్‌తో తయారైన ఈ స్పింక్స్ నవ్వు ముఖంతో ఉంది. దీని బుగ్గకు సొట్టలు కూడా ఉన్నాయి. రోమన్ చక్రవర్తి క్లాడియస్‌కు ప్రాతినిధ్యం వహించేలా దీన్ని తయారుచేసి ఉంటారని భావిస్తున్నారు.
గిజా పిరమిడ్‌ల మధ్య ఉన్న 66 అడుగుల ఎత్తయిన విఖ్యాత స్పింక్స్ కంటే ఇది చాలా చిన్నది.
ఈజిప్ట్ రాజధాని కైరోకు 450 కిలోమీటర్ల దూరంలోని క్వెనా ప్రావిన్స్‌లో ఉన్న దెందెరా ఆలయంలోని రెండంతస్తుల సమాధిలో ఈ కళాఖండాలను కనుగొన్నారు.
ఈ స్పింక్స్ విగ్రహ నవ్వు ముఖం అప్పటి రోమన్ చక్రవర్తి క్లాడియస్‌ను పోలి ఉండొచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్లాడియస్ క్రీస్తు శకం 41 నుంచి 54 మధ్య క్లాడియస్ రోమన్ సామ్రాజ్యాన్ని ఉత్తర ఆఫ్రికా వరకు విస్తరించారు.
ఇక్కడి రాతి పైకప్పుపై ఉన్న గుర్తులను పురావస్తు శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.. ఈ విగ్రహానికి సంబంధించిన మరింత సమాచారం ఆ గుర్తులలో దొరకొచ్చని భావిస్తున్నారు.
‘అందంగా, చక్కగా చెక్కిన’ స్పింక్స్ పక్కనే రోమన్ కాలం నాటి శాసనాలు చెక్కిన రాతి ఫలకం ఒకటి తవ్వితీశారు.
ఇవన్నీ దొరికిన మందిరం కూడా లైమ్‌స్టోన్‌తో నిర్మించినదే. రెండు పొరల ప్లాట్‌ఫాం, మట్టి ఇటుకల ఆవరణ ఇక్కడ ఉన్నాయి.
కాగా తీవ్ర ఆర్థిక కష్టాలలో ఉన్న ఈజిప్ట్ ప్రభుత్వం పర్యటక రంగాన్ని మళ్లీ పట్టాలెక్కించి ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఈ పురావస్తు అవశేషాలు గుర్తిస్తోందని పలువురు అంటున్నారు.
ఇటీవల కాలంలో ఈజిప్ట్‌లో పురావస్తు తవ్వకాలలో అనేక ఆనవాళ్లు బయల్పడుతున్నాయి. కొత్తగా అనేకం గుర్తిస్తున్నారు.
కొద్దిరోజుల కిందట గిజా పిరమిడ్‌లో రహస్య సొరంగాన్ని కనుగొన్నారు. ఎండోస్కోప్ స్కానింగ్‌తో పిరమిడ్‌లో ఏం ఉందో చూశారు.
ఈజిప్ట్‌లోని ఓ మ్యూజియం స్టోర్ రూంలో ఉంచిన మమ్మీలో గుండె స్థానంలో బంగారంతో చేసిన గుండె ఆకారంలోని వస్తువు.. నాలుక, మరికొన్ని శరీరభాగాలు కూడా బంగారంతో చేసినవే ఉన్నట్లు గుర్తించారు.
4,300 ఏళ్లుగా తెరవని ఓ సమాధిలో బంగారు ఆకులతో కప్పిన మమ్మీని గుర్తించారు.
ఇవి కూడా చదవండి:
- బైరి నరేశ్ మీద పోలీస్ జీపులో ఉండగానే దాడి... దీనిపై పోలీసులు బీబీసీతో ఏమన్నారు?
- ఆంధ్రప్రదేశ్-అమ్మఒడి: ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు సీట్లు కేటాయించడంపై వివాదం ఏమిటి?
- బంగ్లాదేశ్ నుంచి ఈ 500 మంది భారత్‌కు ఎందుకు వచ్చారు? వాళ్లు ఏం కోరుతున్నారు?
- ప్రీతి: ‘కరోనాను ఎదిరించి గెలిచింది కానీ... వేధింపులను తట్టుకుని నిలబడలేక పోయింది’
- ఎండలు బాబోయి ఎండలు... ఫిబ్రవరిలో ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)