You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రిపబ్లిక్ డే - ఫోటో ఫీచర్: పరేడ్‌ను తొలిసారిగా ముందుండి నడిపించిన మహిళలు
దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం జరిగిన 75వ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా పరేడ్ నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశ ప్రధాని నరేంద్ర మోదీలు ఈ పరేడ్‌ను నిర్వహించారు.
తొలిసారిగా పరేడ్‌లో భారత త్రివిధ దళాలు, పారామిలటరీ దళాలను మహిళా సైనికులే ముందుండి నడిపించారు.
మొదటిసారి భారత ఆర్మీ, వైమానిక, నౌకా దళాలకు చెందిన మహిళా సైనికుల బృందాలే పరేడ్‌లో పాల్గొన్నాయి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది దిల్లీలో జరిగే పరేడ్‌లో భారత వైమానిక దళం, నావికా దళం, భారత ఆర్మీ, పారామిలటరీ దళాలు పరేడ్‌లో పాల్గొంటాయి. ఈసారి ఫ్రెంచ్ సైన్యం కూడా పాల్గొంది.
ఈ ఏడాది పరేడ్ ప్రదర్శనలు 'వికసిత్ భారత్', 'భారత్- లోక్‌తంత్ర కీ మాతృక' అనే థీమ్‌ను అనుసరించి జరిగాయి.
ఇవి కూడా చదవండి..
- క్యాష్‌లెస్ ఎవ్రీవేర్: హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఇకపై నెట్వర్క్ హాస్పిటల్స్‌లోనే కాదు, దేశంలో ఎక్కడైనా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్... 48 గంటల నిబంధన గుర్తుంచుకోండి
- పద్మవిభూషణ్ - వెంకయ్య నాయుడు: ఆరెస్సెస్ కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగిన నేత
- చిప్స్, కూల్ డ్రింక్స్‌తో ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉంటుంది, పూర్తిగా మానేయాలా? ఎంత తినొచ్చు
- శుభ్‌మన్ గిల్, అశ్విన్, షమీ, స్మృతి మంధానకు బీసీసీఐ అవార్డులు.. పురస్కారాలు పొందిన క్రీడాకారుల జాబితా ఇదే
- సుభాష్‌చంద్రబోస్: ‘మై డార్లింగ్, నువ్వు నా హృదయరాణివి’ అంటూ బోస్ ఎవరికి ప్రేమలేఖలు రాశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)