వైజాగ్: మొంథా తుపాను ప్రభావం, బీచ్ నుంచి జనాలను వెనక్కు పంపుతున్న సిబ్బంది, 9 ఫోటోలలో...

ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను ప్రభావం మొదలైంది.

రాష్ట్రంలోని బీచ్‌ల వద్దకు పర్యటకులను అనుమతించడం లేదు. తుపాను నేపథ్యంలో విశాఖ ఆర్కే బీచ్‌లో ఉన్న ప్రజలను సిబ్బంది అక్కడినుంచి పంపించేశారు.

రాష్ట్రంలో తుపాను ప్రభావం ప్రారంభమైందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

తుపాను దగ్గరకు వచ్చే కొద్దీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)