బెంగళూరును ముంచెత్తిన వర్షం, 7 ఫోటోల్లో వరద తీవ్రత..

బెంగళూరులో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరింది.

ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీరు కారణంగా ఆఫీసులకు వెళ్లేందుకు కూడా కష్టమైంది.

శాంతినగర్‌‌లోని బీఎమ్‌టీసీ బస్సు డిపోలో నడుములోతు వర్షపు నీరు చేరడంతో బస్సులను బయటకు తీయలేక అవస్థ పడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)