ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు: చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, కుర్దులే - బీబీసీ పరిశోధన
ఇరాన్‌లో మూడు నెలల నుంచి జరుగుతున్న ఆందోళనల్లో 75 మందికిపైగా మరణించినట్లు బీబీసీ హండ్రెడ్ విమెన్ కోసం చేసిన పరిశోధన గుర్తించింది. మరణించిన వారిలో మంది మహిళలు, మైనార్టీ వర్గాలకు చెందినవారని తేలింది.
ఈమె హాస్తి. చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోయింది. సిస్తాన్ బలుచిస్తాన్‌లో.. అమ్మమ్మతో కలిసి శుక్రవారం ప్రార్థనలకు వెళ్లింది.
అక్కడకు దగ్గరలోనే ఆందోళనచేస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు
హస్తీకి టియర్ గ్యాస్ తూటా తగిలిందని స్థానిక కార్యకర్త చెప్పారు. దాంతో ఆమె స్పృహ కోల్పాయారు. తర్వాత చనియారు.
ఆరోజు పది మంది చిన్నారులతో సహా 66 మంది చనిపోయారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.
చనిపోయిన వారిలో మూడింట రెండొంతుల మంది సిస్తాన్ బలూచిస్తాన్‌లో కుర్దిష్ ప్రాంతాలకు చెందిన వారు. ఇక్కడ సున్నీ ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వారు కూడా ఉన్నారు.
ఇరాన్‌లో మైనార్టీ వర్గాలున్నఎక్కువగా ఈ రెండు ప్రాంతాల్లో ప్రభుత్వ హింస ఎక్కువగా ఉందని బీబీసీ పరిశోధనలో తేలింది. నిరాయుధులైన ఆందోళనకారులపై అధికారులు ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారు. వందల మందిని చంపేశారు.
మీడియాపై కఠిన నియంత్రణ .. సిస్తాన్ బలూచిస్తాన్ వంటి పేద, సంప్రదాయవాద ప్రాంతాల్లో ఇంటర్నెంట్ అంతగా అందుబాటులో లేకపోవడం.. ఉన్నా సోషల్ మీడియా వాడకం చాలా తక్కువగా ఉండడం వల్ల మరణించిన వారిని గుర్తించడం కష్టమైంది.
ఆందోళనల్లో 300 మందికిపైగా మరణించినట్టు అధికారులు అంగీకరించారు. ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని మానవ హక్కుల సంఘాలు అంటున్నాయి. మరణాలను ప్రభుత్వం దాచి ఉంచుతోందని చాలా మంది భావిస్తున్నారు.
మరణాల సంఖ్య వెనుక ఎన్నో కుటుంబాల విషాదం దాగుంది. శిక్ష పడుతుందనే భయంతో చాలా మంది మాట్లాడటం లేదు.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



