మహిళల్లో కోపం అతిగా పెరిగిపోతోంది.. ఎందుకు?

వీడియో క్యాప్షన్, ఇంటా బయటా వారిపై ఉన్న ఒత్తిడే కారణమంటున్న నిపుణులు..
మహిళల్లో కోపం అతిగా పెరిగిపోతోంది.. ఎందుకు?
    • రచయిత, స్టెఫానీ హెగార్టీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచవ్యాప్తంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో కోపం, బాధ, ఆవేదన, ఒత్తిడి పెరిగాయని చెబుతోంది గాలప్ పోల్.

బీబీసీ 100 విమెన్ సీజన్‌లో భాగంగా గాలప్ వరల్డ్ పోల్ నిర్వహించిన సర్వేలో పదేళ్ల డేటాను పరిశీలించింది బీబీసీ.

లక్షా ఇరవై వేల మందిపై జరిపిన ఈ సర్వేలో అందరిలోనూ వ్యతిరేక భావనలు పెరిగినప్పటికీ కోపం విషయంలో ఇది ఒకింత ఎక్కువగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళల్లో కోపం పెరుగుతోంది. గాలప్ అనే సంస్థ సహకారంతో పదేళ్లుగా 150కి పైగా దేశాలలో బీబీసీ నిర్వహించిన పోలింగ్ ఆధారంగా తెలిసిన విషయమిది.

మీరు నిన్న ఎటువంటి ఎమోషన్స్ అనుభవించారు ఎన్ని సార్లు కోపగించుకున్నారు అని మహిళలు, పురుషులను అడిగినప్పుడు 2012లో వారి సమాధానం చాలా వరకు ఒకేలా అనిపించింది. కానీ 9 ఏళ్ల తర్వాత పురుషులతో పోలిస్తే మహిళల్లో కోపం పెరిగింది.

తాషా , జాక్వెలిన్ కలిసి సేక్రెడ్ రేజ్ థెరపీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది మహిళలంతా ఓచోట చేరి వారికి కోపం తెప్పించే విషయాల గురించి మాట్లాడుకుంటారు. తర్వాత కోపం తీరేలా బిగ్గరగా అరుస్తారు.

అరవడం అనే విషయానికొస్తే ఆ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు దాదాపు 20 నుంచి 30 నిమిషాల పాటు ఏకధాటిగా అరవొచ్చు.

2021లో పురుషులతో పోలిస్తే మహిళల్లో కోపం ఎక్కువైందని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ లెక్కల్లో తేడా ఆరుశాతమైతే... భారత్, కొలంబియా, పాకిస్తాన్ , లావోస్, మొరాకో వంటి మరికొన్ని ప్రాంతాలలో ఈ తేడా మరింత ఎక్కువేనని చెబుతున్నారు.

భారత్లో ఇది 12 శాతంగా ఉంది.

కానీ ఈ కోపం అంత చెడ్డ విషయమేమీ కాదు.

ప్రస్తుతం మహిళలు కూడా గొంతెత్తి ‘ ఇక చాలు అని చెప్పగలిగే పరిస్థితుల్లోనే ఉన్నారు. అలా తమలోని మార్పును స్పష్టంగా చెప్పడానికి కూడా కొన్నిసార్లు ఈ కోపాన్ని వినియోగించుకుంటున్నారు.

కోపంతో రగిలిపోతున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)