ప్రపంచ ఆదివాసీ దినోత్సవం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివాసీ సంబరాల ఛాయాచిత్రాలు

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్ట్ 9న జరుపుకుంటారు.

ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం 1994 నుండి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

1994 డిసెంబర్ 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తన తీర్మానం 49/214లో ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ ప్రజల కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.

ఐక్యరాజ్య సమితి ‘ Indigenous Youth as Agents of Change for Self-determination’ అనే థీమ్‌తో ఈ ఏడాది కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా ఈ అంశాలపై ఆదివాసీ యువతను ప్రోత్సహిస్తోంది.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వివిధ ఆదివాసీ సమూహాల సాంస్కృతిక, సామాజిక జీవనం ఛాయా చిత్రాల రూపంలో...

1. దండారీ ఉత్సవాల సందర్భంగా గుస్సాడీ దీక్షలో ఆదివాసీలు

2. ఆంధ్రప్రదేశ్‌లోని వాల్మీకి తెగ మహిళల దింసా నృత్య ప్రదర్శన

3. తెలంగాణకు చెందిన కోయ ఆదివాసీల కొమ్ము నృత్యం

4. మేడారం జాతరలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆదివాసీ-కొమ్ము బూరతో

5. జంగుబాయి జాతర, ఆదిలాబాద్

6. వివిధ రకాల వెండి ఆభరణాలతో కోలం జాతి ఆదివాసీ యువతి

7. దండారి ఉత్సవంలో గోండు ఆదివాసీ విచిత్ర వేషధారణ

8. ఉత్సవంలో వేణువు ఊదుతున్న నాయకపోడు

9. అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్తున్న ఆదివాసీ మహిళలు

10. అడవిలో ఆదివాసీ గుస్సాడీ

11. సాంస్కృతిక ప్రదర్శనలో కోయ బాలిక

12. రాజ్ గోండ్ ఆదివాసీ వృద్ద మహిళలు

13. గూడెంలో ఆదివాసీలు

14. గోండు మహిళ

15. ప్రకృతి ఒడిలో ఆదివాసీ బాలుడు

16. ఆదివాసీల జీవితాల్లో ముడిపడి ఉన్న రేలా పువ్వులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)