నేపాల్: హింస, విధ్వంసకాండ తర్వాత ఎలా మారిందంటే... 10 ఫోటోల్లో

నేపాల్ కాస్త శాంతించింది. సోషల్ మీడియాపై నిషేధంతో వీధుల్లోకి వచ్చిన 'జెన్ జడ్' నిరసనకారులు ప్రభుత్వం అవినీతిమయం అయిందంటూ ఆందోళనలకు దిగారు. ఈ సందర్భంగా విధ్వంసం జరిగింది.

పోలీసులకు, నిరసనకారులకు మధ్య తలెత్తిన ఘర్షణలతో సోమవారం నుంచి హింసాత్మకంగా మారిన నేపాల్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

సోమవారం మొదలైన నిరసనలు గురువారం నాటికి తగ్గుముఖం పట్టాయి.

నిరసనల సందర్భంగా దేశంలోని ప్రభుత్వ భవనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు.

దేశంలో నెలకొన్న కల్లోలంతో దేశ ప్రధాని కేపీ ఓలీ సహా పలువురు మంత్రులు తమ పదవికి రాజీనామా చేశారు.

హింస, విధ్వంసకాండలో పాల్గొన్న ఎవరినీ క్షమించబోమని సైన్యం స్పష్టం చేసింది. ఇప్పటివరకు హింస, దోపిడీ ఆరోపణలతో 27 మందిని అరెస్ట్ చేశారు.

హింసాత్మక ఘర్షణల తర్వాత నేపాల్ ఎలా ఉందో ఫోటోల్లో చూద్దాం.

గురువారం నుంచి కాఠ్‌మాండూలోని మూడు జిల్లాల్లో కర్ఫ్యూను కాస్త సడలించారు.

ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, పౌరుల ప్రాణాలను, ఆస్తులను కాపాడటానికి ఆంక్షలు, కర్ఫ్యూను కొనసాగించాల్సిన అవసరం ఉందని సైన్యం పేర్కొంది.

కాఠ్‌మాండూ, భక్తపూర్, లలిత్‌పూర్‌లో గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతుందని ఆర్మీ ప్రకటించింది.

కర్ఫ్యూ సమయంలో ఉద్యోగులు తమ గుర్తింపు కార్డులను చూపించాలని సైన్యం కోరింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)