You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
4600 ఏళ్ల పురాతన పడవ, బంగారంతో చేసిన సమాధి ఇంకా ఎన్నో...
ఈజిప్ట్‌లోని గీజా గ్రేట్ పిరమిడ్ దగ్గర నిర్మించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ఇది. ఇప్పుడు దీనిని ప్రజల సందర్శనార్థం తెరిచారు.
ఈ మ్యూజియం 120 ఎకరాల్లో ఉంది. ఇందులో 70 వేల నుంచి లక్ష వరకూ పురాతన అవశేషాలను ప్రదర్శిస్తారు. వాటిలో ఫారో టుటెన్‌ఖమెన్ సమాధిలో లభించినదీ, ఇప్పటివరకూ ఎవరూ చూడని సంపదా ఇందులో ఉన్నాయి.
ఈ మ్యూజియం గురించి 2002లో ప్రకటించారు. దీనిని 2012లో ప్రారంభించాలని అనుకున్నారు. కానీ వ్యయం పెరగడం, రాజకీయ అస్థిరత, కోవిడ్ 19, ప్రాంతీయ ఘర్షణ వల్ల దీనిని పదే పదే వాయిదా వేస్తూ వచ్చారు.
దాదాపు 1.2 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టులో ఎక్కువ భాగం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ రుణాలతో పూర్తయ్యింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)