You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: ఎల్‌ఈడీ వెలుగుల్లో చామంతి పూల సాగు
గోదావరి తీరంలో కొన్ని ప్రాంతాల్లో చామంతి పూల సాగు చేస్తున్నారు.
పగటి పూట చామంతులతో అందంగా ఉండే పొలాలు.. ఇప్పుడు రాత్రిళ్లు ఎల్‌ఈడీ వెలుగులతో కొత్తగా కనిపిస్తున్నాయి.
చామంతి మొక్కలకు ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు వెనుక ఒక కారణం ఉంది.
చామంతుల సాగులో నారు ముఖ్యమైంది. నారు తయారు కావాలంటే త్వరగా మొగ్గలు రాకూడదు. అప్పుడే కాండం బలపడి ఎక్కువ నారు తయారవుతుంది. అందుకే మొక్కలు వేగంగా పూలు పూయకుండా ఇలాంటి లైటింగ్ ఏర్పాటు చేశామని రైతులు చెబుతున్నారు.
తమ అవసరాల మేరకు చామంతి నారు సిద్ధంగా లేకపోవడంతో రైతులు ఇలా ప్రత్యామ్నాయ పద్ధతులు పాటిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాలతో పాటు కృష్ణా, గోదావరి తీరంలో చామంతుల సాగు ఎక్కువ.
చామంతుల సాగులో పగటి సమయం ఎక్కువ ఉండడం ఉపయోగకరమని, లైటింగ్ ద్వారా దానిని కృత్రిమంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ అనుభవమేనని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘నా భార్య నగ్న ఫోటోలు అప్పులోళ్ల దగ్గరకు ఎలా వెళ్లాయి’
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- కాంతారా: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మీద అసంతృప్తి ఎందుకు
- విప్ప సారా: బ్రిటిషర్లు నిషేధించిన ఈ భారతీయ మద్యం అంతర్జాతీయంగా ఆదరణ పొందగలదా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)