అవినీతి కుంభకోణంలో యూరోపియన్ పార్లమెంట్: ఈయూ అధికారులకు ఖతర్ ప్రభుత్వం నుంచి లంచాలు
యూరోపియన్ యూనియన్ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు ఖతర్ ప్రభుత్వం కొందరు అధికారులకు లంచాలు ఇచ్చిందనే ఆరోపణలపై యూరోపియన్ పార్లమెంట్ అత్యవసరంగా సమావేశం అయింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, నాయకుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఈయూ ఉపాధ్యక్షురాలు ఇవా కైలీ నివాసంలో కోట్లాది రూపాయలు లభించాయి.
అయితే అవినీతీ అరోపణలను ఖతర్ ప్రభుత్వం ఖండించింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యులపై చట్టపరంగా విచారణ జరుగుతుందన్నారు యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు రొబర్టా మెట్సోలా.
ఈ వ్యవహారంలో సిట్టింగ్ ఎంపీ సహా నలుగురిని బెల్జియం కోర్టులో హాజరపర్చనున్నారు.
అవీనితి, మనీలాండరింగ్, సంస్థాగత నేరానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అందులో యూరోపియన్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఎవా కైలీ ఒకరు.
ఈ కుంభకోణం యూరోపియన్ వ్యవస్థ శక్తి, సార్వభౌమత్వానికి ప్రమాదకరంగా మారడంతో ఈయూ వ్యవస్థల నైతికతను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



