‘22 ఏళ్ల కిందట ఈ బీచ్‌లో నడిచాను.. మళ్లీ వస్తాననుకోలేదు’

‘22 ఏళ్ల కిందట ఈ బీచ్‌లో నడిచాను.. మళ్లీ వస్తాననుకోలేదు’

చెన్నై మెరీనా బీచ్‌లో వికలాంగుల కోసం ప్రత్యేకంగా చెక్కలతో ర్యాంపుని నిర్మించారు.

ఇప్పటి వరకూ వీల్‌ఛైర్‌లో ఉండేవాళ్లు.. బీచ్‌లోని ఇసుక దాటుకుని సముద్రపు నీటి వరకూ చేరుకోవడానికి చాలా కష్టంగా ఉండేది.

అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారు కూడా ఇసుక తిన్నెల్లోకి వచ్చి విహరించేందుకు అవకాశం దక్కింది.

‘నేను 22 ఏళ్ల క్రితం ఇక్కడ నడిచాను. ఆ తర్వాత ఇంకెప్పుడూ ఇక్కడికి రాలేనని అనుకున్నా. ఈ కొత్త సదుపాయం వలన నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది’ అని చెన్నైకి చెందిన మురుగేశ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)