కరోనావైరస్ 'తొలి' వ్యాక్సీన్‌కు రష్యా ఆమోదం.... పుతిన్ కూతురికి టీకా ఇచ్చేశారు

వీడియో క్యాప్షన్, 'కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేశాం. నా బిడ్డకు కూడా ఈ టీకా ఇచ్చాం' -అధ్యక్షుడు పుతిన్

"కరోనాను ఎదుర్కోడానికి మొదటి వ్యాక్సీన్‌ సిద్ధమైంది'' అని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన మంత్రులకు మంగళవారం ఉదయం వెల్లడించారు.

ఈ వ్యాక్సిన్‌తో మనుషులపై రెండు నెలలుగా పరీక్షలు జరిపామని, ఇది అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని, ప్రభావవంతంగా పని చేస్తుందని అన్నారు.

ఈ వ్యాక్సీన్‌ను రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఆమోదించింది. రష్యాలో ఈ వ్యాక్సీన్‌ను ప్రజలకు పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)