దళిత్ పాప్: 'చమార్' అని గర్వంగా చెప్పుకుంటాం!

వీడియో క్యాప్షన్, జిన్నీ మాహీ: పాప్‌ సంగీతంలో దళిత గొంతుక!

రిపోర్టర్: సరబ్జీత్ సింగ్ దలివాల్, వీడియో: గుల్షన్ కుమార్

పంజాబ్‌లో దళితులైన ‘చమార్‌’లు పాప్ సంగీతం ద్వారా, పాటల రూపంలో తాము చమార్‌లమని గర్వంగా ప్రకటించుకుంటున్నారు. అంబేడ్కర్ పిల్లలమని ప్రచారం చేసుకుంటూ ఆయన భావజాలాన్ని అనుసరిస్తున్నారు.

‘మేం శాంతిని కోరుకుంటాం. దాన్ని కాపాడుకోవడానికి శాంతియుతంగా పోరాడతాం. అవసరమైతే దేనికైనా తెగిస్తాం’ అంటారు వాళ్లు.

‘నిన్నమొన్నటి దాకా పై కులాల వాళ్లే పాప్ గీతాలు పాడేవారు. కానీ మేమేం తక్కువ? మా గురించి మేం చెప్పుకోవడానికి పాప్ సంగీతమే మంచి మాధ్యమం’ అంటూ కొందరు దళిత గాయకులు బీబీసీతో తమ మనోభావాలను పంచుకున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)