ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘సిద్ధం’ సభలో మాట్లాడిన తీరుపై జగన్‌కు నోటీసు ఇచ్చింది ఈసీ.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. జగన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
రెండు రోజుల క్రితమే జగన్‌పై చంద్రబాబు విమర్శలకు వివరణ కోరుతూ టీడీపీ అధినేతకు ఈసీ నోటీసులు జారీ చేసింది. తాజాగా ప్రతిపక్ష నేతపై చేసిన విమర్శలకు సీఎం జగన్‌ను వివరణ కోరింది ఎన్నికల సంఘం.
ఇజ్రాయెల్ దాడుల తర్వాత, గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్ షిఫా బూడిదగా మారిందని, అక్కడ అనేక మృతదేహాలు పడి ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) శనివారం తెలిపింది.
రెండు వారాల సైనిక ఆపరేషన్ తర్వాత ఇజ్రాయెల్ భద్రతా దళాలు, గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోయాయి.
దీంతో డబ్ల్యూహెచ్‌వోకు చెందిన ఒక బృందం ఈ ఆసుపత్రిలోకి వెళ్లగలిగింది. మార్చి 25 నుంచి ఈ ఆసుపత్రిలోకి వెళ్లేందుకు డబ్ల్యూహెచ్‌వో ప్రయత్నించింది.
అల్ షిఫా ఆసుపత్రి పరిస్థితి గురించి డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ ట్వీట్ చేశారు.
‘‘ఒకప్పుడు గాజా ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న అల్ షిఫా ఆసుపత్రిలోకి వెళ్లగలిగాం. ఇటీవలి ముట్టడి తర్వాత ఈ ఆసుపత్రి శ్మశానంగా మారింది.
ఆసుపత్రిలో తిరుగుతున్నప్పుడు మా బృందానికి అయిదు మృతదేహాలు కనిపించాయి.
ఆసుపత్రి భవన సముదాయంలోని చాలా భవనాలు ఘోరంగా ధ్వంసం అయ్యాయి. చాలా వస్తువులు బూడిదగా మారాయి’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.