ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జరిగిన సభకు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
తెలంగాణలో బీజేపీ 'బీ' టీమ్‌ను ఓడించామని, త్వరలోనే 'ఏ' టీమ్ బీజేపీనీ ఓడించబోతున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కోసం కోట్లాట జరుగుతోందని చెప్పారు.
‘జన జాతర’ పేరుతో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో శనివారం ప్రారంభించింది.
హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జరిగిన సభకు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే ఐదు గ్యారెంటీల న్యాయపత్రాన్ని రాహుల్ గాంధీ విడుదల చేశారు.
‘‘తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించింది’’ అని రాహుల్ గాంధీ చెప్పారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాలు కల్పించనున్నామన్నారు.
దేశంలో లక్షల మంది మనసుల్లో ఉన్న ఆశలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోను తయారు చేసినట్లు రాహుల్ చెప్పారు. తమ మేనిఫెస్టో భారతీయుల ఆత్మ అని ఆయన అభివర్ణించారు.
‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు లక్ష రూపాయలతో కూడిన జీతం ఇస్తాం. యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్ కల్పిస్తాం. పేద మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు నేరుగా బ్యాంకులో జమ చేస్తాం. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తాం. ఈ మద్దతు ధరకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. కార్మికులకు కనీస వేతన చట్టం తీసుకువస్తాం. కార్మికులతోపాటు జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం కూలీలకు రోజుకు కనీస వేతనం రూ.400గా నిర్ణయిస్తాం. దళితులు, వెనుకబడిన వర్గాల కోసం కులగణన చేపడతాం’’ అని రాహుల్ గాంధీ చెప్పారు.
నిరుపేదలు, మహిళలు, యువత, రైతులు, కార్మికుల ముఖచిత్రాన్ని మార్చే మేనిఫెస్టో తీసుకువచ్చామని ఆయన అన్నారు.
మేడిన్ తెలంగాణ బ్రాండు మేడిన్ చైనాను మించేలా మారాలని చెప్పారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవస్థలను దుర్వినియోగం చేసి.. వేల మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వం మారగానే ట్యాపింగ్ రికార్డులను మూసీ నదిలో పడేశారని చెప్పారు.
కేసీఆర్ తరహాలోనే మోదీ కూడా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పుడు ఎక్సాటార్షన్ డైరెక్టరేట్‌గా మారిందన్నారు. అవినీతిపరులందరూ మోదీ పక్కన చేరారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
హమాస్ మిలిటెంట్లు బందీగా తీసుకెళ్లిన ఒక ఇజ్రాయెల్ పౌరుడి మృతదేహాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఖాన్ యూనిస్‌లో అర్థరాత్రి నిర్వహించిన గాలింపులో ఈ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సైన్యం చెప్పింది.
2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ భీకర దాడులు చేసి, కిబుట్జ్ నిర్ ఓజ్ నుంచి ఎలాద్ కట్జిర్ అనే వ్యక్తిని బందీగా తీసుకెళ్లింది.
అర్థరాత్రి గాజాలో గుర్తించిన ఆయన మృతదేహాన్ని తిరిగి ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్), ఇజ్రాయెల్ సెక్యూరిటీస్ అథారిటీ(ఐఎస్ఏ) తెలిపాయి.
‘‘ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం అపహరణకు గురై మిలిటెంట్ల చెరలో చనిపోయిన ఎలాద్ కట్జిర్ మృతదేహాన్ని ఖాన్ యూనిస్ ప్రాంతంలో గుర్తించాం. ఆ తర్వాత మృతదేహాన్ని ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చాం’’ అని ఐడీఎఫ్, ఐఎస్ఏలు తెలిపాయి.
47 ఏళ్ల ఎలాద్ కట్జిర్‌ను తన తల్లి హన్నా(77 ఏళ్లు)తో పాటు హమాస్ బందీగా తీసుకెళ్లింది.
తన తల్లిని నవంబర్‌లో విడిచిపెట్టారు. ఆయన తండ్రి అవ్రహమ్ కిబుట్జ్‌లో హత్యకు గురైనట్లు ఐడీఎఫ్, ఐఎస్ఏ తెలిపాయి.
అమెరికాలోని ఒహాయోలో ఒక భారతీయ విద్యార్థి మృతి చెందారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు న్యూయార్క్‌లోని భారతీయ కాన్సులేట్ తెలిపింది.
ఇప్పటివరకు విద్యార్థి మృతికి గల కారణాలు తెలియలేదు.
ఈ విషయాన్ని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ట్వీట్ ద్వారా వెల్లడించింది.
‘‘క్లీవ్‌ల్యాండ్‌లోని ఒహాయోలో భారతీయ విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె మరణం చాలా బాధాకరం. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉమా మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు పంపించడంతో పాటు అవసరమైన ఇతర సహాయాన్ని అందిస్తాం’’ అని ట్వీట్ చేసింది.
అమెరికాలో నివసిస్తోన్న భారతీయ లేదా భారత మూలాలున్న విద్యార్థుల మరణాలు కేసులు ఇటీవల పెరిగాయి.
తాజాగా ఉమా సత్యసాయి మరణంతో అమెరికాలో ఉన్న భారతీయ సమాజం షాక్‌కు గురైంది.
ఈ ఏడాది దాదాపు ఆరుగురు భారతీయ విద్యార్థులపై ప్రాణాంతక దాడులు జరిగాయి.
మార్చిలో 34 ఏళ్ల క్లాసికల్ డ్యాన్సర్ అమర్‌నాథ్ ఘోష్‌ను కాల్చి చంపేశారు.
మొహమ్మద్ అబ్దుల్ అరాఫత్ 2023 మే నెలలో క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో చదవడం కోసం వెళ్లారు. అయితే ఈ ఏడాది మార్చి నుంచి ఆయన కనిపించడం లేదు.
ఫిబ్రవరి నెలలో సమీర్ కామథ్ అనే భారతీయ విద్యార్థి మృతదేహంగా కనిపించారు. ఐటీ ఎగ్జిక్యూటివ్ వివేక్ తనేజా మీద దాడి జరిగింది.
చాలా రోజులుగా కనిపించకుండా పోయిన నీల్ ఆచార్య అనే మరో విద్యార్థి మృతదేహం జనవరి 30న లభ్యమైంది.
జనవరి 29న ఒక వ్యక్తి, భారత విద్యార్థి వివేక్ సైనీ మీద సుత్తితో దాడి చేసి హత్య చేశారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.