ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024: సీఎం జగన్‌కు ఈసీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. ఎలాంటి లక్షణాలు లేకుండానే అంధులు అవుతున్నారు, ఎందుకిలా?

  3. ఆపరేషన్ల నుంచి అంతరిక్షం వరకు.. అయస్కాంతాలు ప్రపంచాన్ని ఎలా మార్చేస్తున్నాయంటే..

  4. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024: సీఎం జగన్‌కు ఈసీ నోటీసులు

    ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్

    ఫొటో సోర్స్, APCMO/FB

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది.

    ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘సిద్ధం’ సభలో మాట్లాడిన తీరుపై జగన్‌కు నోటీసు ఇచ్చింది ఈసీ.

    ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

    తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. జగన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

    రెండు రోజుల క్రితమే జగన్‌పై చంద్రబాబు విమర్శలకు వివరణ కోరుతూ టీడీపీ అధినేతకు ఈసీ నోటీసులు జారీ చేసింది. తాజాగా ప్రతిపక్ష నేతపై చేసిన విమర్శలకు సీఎం జగన్‌ను వివరణ కోరింది ఎన్నికల సంఘం.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. గాజాలో ఇజ్రాయెల్ చేసిన తప్పులివే... బీబీసీ పరిశోధనలో తేలిన వాస్తవాలు

  6. ప్రపంచంలోనే అత్యధిక వయసున్న పురుషుడు ఈయన, ప్రతి శుక్రవారం ఏం తింటారంటే..

  7. వరల్డ్ హెల్త్ డే: స్ట్రెస్, డిప్రెషన్‌లను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి?

  8. ‘ఎలక్షన్ కింగ్’ పద్మరాజన్: 239 ఎన్నికల్లో పోటీ, ఓటమే ఈయన స్పెషాలిటీ..

  9. గాజాలోని అల్ షిఫా హాస్పిటల్ శ్మశానంగా మారిందన్న డబ్ల్యుహెచ్ఓ

    ఇజ్రాయెల్

    ఫొటో సోర్స్, WHO

    ఇజ్రాయెల్ దాడుల తర్వాత, గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్‌ షిఫా బూడిదగా మారిందని, అక్కడ అనేక మృతదేహాలు పడి ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) శనివారం తెలిపింది.

    రెండు వారాల సైనిక ఆపరేషన్ తర్వాత ఇజ్రాయెల్ భద్రతా దళాలు, గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోయాయి.

    దీంతో డబ్ల్యూహెచ్‌వోకు చెందిన ఒక బృందం ఈ ఆసుపత్రిలోకి వెళ్లగలిగింది. మార్చి 25 నుంచి ఈ ఆసుపత్రిలోకి వెళ్లేందుకు డబ్ల్యూహెచ్‌వో ప్రయత్నించింది.

    అల్ షిఫా ఆసుపత్రి పరిస్థితి గురించి డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ‘‘ఒకప్పుడు గాజా ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న అల్ షిఫా ఆసుపత్రిలోకి వెళ్లగలిగాం. ఇటీవలి ముట్టడి తర్వాత ఈ ఆసుపత్రి శ్మశానంగా మారింది.

    ఆసుపత్రిలో తిరుగుతున్నప్పుడు మా బృందానికి అయిదు మృతదేహాలు కనిపించాయి.

    ఆసుపత్రి భవన సముదాయంలోని చాలా భవనాలు ఘోరంగా ధ్వంసం అయ్యాయి. చాలా వస్తువులు బూడిదగా మారాయి’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

  10. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  11. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024: సీఎం జగన్‌కు ఈసీ నోటీసులు