ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..
గుడ్ నైట్.
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో ప్రచురించింది ఎన్నికల కమిషన్. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బాండ్ల వివరాలను మార్చి12న ఎన్నికల కమిషన్‌కు అందజేసింది. వాటిని వెబ్‌సైట్‌లో పొందుపర్చింది ఎన్నికల సంఘం.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..
గుడ్ నైట్.

ఫొటో సోర్స్, ANI
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారని, కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎమ్ ఆసుపత్రిలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఈ మేరకు ఆసుపత్రిలో చేరిన మమతా బెనర్జీ ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ, “మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారని తృణముల్ కాంగ్రెస్ తెలిపింది” అని వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ECI/Website
సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో ప్రచురించింది ఎన్నికల కమిషన్.
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, మార్చి 15 సాయంత్రం ఐదు గంటలలోగా వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాల్సి ఉంది. ఒకరోజు ముందుగానే వెబ్‌సైట్‌లో ఉంచింది ఎన్నికల కమిషన్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మార్చి 12న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ వివరాలను ఎన్నికల సంఘానికి పంపింది.
ఎస్‌బీఐ పంపిన సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచామని ప్రెస్‌నోట్‌లో వెల్లడించింది ఎన్నికల కమిష్.
ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు పొందొచ్చు.
మొత్తం రెండు భాగాలుగా ఈ బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.
మొదటి పార్ట్‌లో ఎవరెవరు, ఎంత మొత్తంలో, ఏ తేదీన బాండ్లను కొనుగోలు చేశారన్న వివరాలు ఉండగా, రెండోదానిలో ఏ పార్టీ ఏ తేదీన ఎంత మొత్తంలో ఎన్‌క్యాష్ చేసుకుందన్న వివరాలు ఉన్నాయి.
జాబితాలో ప్రముఖ సంస్థలు..
రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిస సంస్థల జాబితాలో,
భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఫార్మా లిమిటెడ్, మేఘ ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, మ్యాన్‌కైండ్, సిప్లా లిమిటెడ్,స్పైస్‌జెట్ లిమిటెడ్, జేకే సిమెంట్ లిమిటెడ్, డీఎల్‌ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్ లిమిటెడ్, అవాన్ సైకిల్స్ లిమిటెడ్, ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్, లక్ష్మీ నివాస్ మిట్టల్, ఎడెల్వీస్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, జీహెచ్‌సీఎల్ లిమిటెడ్, జిందాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, పెగాసస్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్.. వంటి పలు సంస్థలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, CHANDRABABU/FB
34 మంది అభ్యర్థులతో తెలుగుదేశ పార్టీ అధినేత చంద్రబాబు రెండో జాబితాను ప్రకటించారు. బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత టీడీపీ ఈ అభ్యర్థులను ప్రకటించింది.
బీజేపీ పొత్తు కుదరక ముందు మొదటి దశలో టీడీపీ 94 మంది అభ్యర్థుల్ని జనసేన 24 మంది అభ్యర్థుల్ని ప్రకటించాయి.
అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామని అభ్యర్థుల జాబితాను ఎక్స్‌లో పోస్టు చేస్తూ చంద్రబాబు తెలిపారు.
మొదటి జాబితాలో చోటు దక్కని సీనియర్ నేతలకు రెండో జాబితాలో స్థానం కల్పించారు. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, గురజాల నుంచి యరపతినేని టీడీపీ తరపున రంగంలోకి దిగబోతున్నారు.
రెండు జాబితాలతో కలిపి టీడీపీ ఇప్పటి వరకు 128 స్థానాలకు అభ్యర్థుల్న ప్రకటించింది
తాజా జాబితాతో టీడీపీ 128 మందిని ప్రకటించినట్లైంది. జనసేన ఇప్పటికే ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
దిల్లీలోని రాంలీలా మైదానంలో వేల మంది రైతులు సమావేశమయ్యారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ రైతులు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
'కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్' పేరుతో జరిగిన ఈ సమావేశంలో, వ్యవసాయానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు.
పోరాటాన్ని ఉధృతం చేసేందుకు కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్‌లో తీర్మానం చేశామని 'సంయుక్త్ కిసాన్ మోర్చా' (SKM) తెలిపింది.
రాంలీలా మైదాన్‌లో 5,000 మందికి మించి జనం గుమికూడరాదని, ట్రక్కు లేదా ట్రాలీని వేదికపైకి లేదా గ్రౌండ్‌లోకి తీసుకెళ్లకూడదనే షరతుతో పోలీసులు అనుమతి ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
‘ఒక దేశం- ఒక ఎన్నిక’కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ్‌నాద్ కోవింద్ కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు సమర్పించింది.
18 వేల పేజీలున్న ఈ నివేదికలో దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీని వల్ల వనరుల వృథా తగ్గడంతో పాటు ప్రజాధనం ఆదా అవుతుందని కమిటీ అభిప్రాయపడింది.
దేశవ్యాప్తంగా అసెంబ్లీలు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది ‘ఒక దేశం- ఒక ఎన్నిక’ లక్ష్యం. దీని సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఎప్పుడూ ఏదో ఒక ఎన్నిక జరుగుతూ ఉండటంతో ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాల అమలుకు ఆటంకం ఏర్పడుతోందని ఎన్డీయే సర్కారు భావిస్తోంది.
నరేంద్ర మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సార్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు.
ఒక దేశం- ఒక ఎన్నిక అమలుపై ఏర్పాటు చేసిన కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ నాయకత్వం వహించారు.
ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఉన్నారు.

తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి మృతి కేసులో అరెస్టులు మొదలయ్యాయి.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన పసుమర్తి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి ఆయను తెనాలికి తరలించారు.
అయితే, తమ కార్యకర్త, సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన పసుమర్తి రాంబాబును ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అరెస్టు చేశారని టీడీపీ ఆరోపించింది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన గీతాంజలి వీడియో మీద పలువురు అభ్యంతర పదజాలంతో ట్రోల్స్ చేశారని, దాంతో మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకున్నారని గుంటూరు ఎస్పీ తుషార్ చెప్పారు.
ఆమెపై ట్రోల్స్ చేసిన వారిలో రాంబాబు కూడా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో చేసిన పోస్టుల ఆధారంగా ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, SHAHJAHAN SHAIKH
బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే షేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత, సందేశ్‌ఖాలీలో పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేస్తోంది.
బలవంతంగా భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణల కేసులో ఈడీ ఈ దాడులు చేపట్టింది.
తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు నేతలు, వారి సహచరులు చాలాకాలంగా తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారని అక్కడి మహిళలు ఆరోపించారు.
తమను లైంగికంగా కూడా వేధించారని, వ్యవసాయ భూములను బలవంతంగా ఆక్రమించారని ఆరోపించారు.
ఈ ఆరోపణల కేసు నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగి, సందేశ్‌ఖాలీలో పలు ప్రాంతాల్లో దాడులు చేస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈలింక్‌ను క్లిక్ చేయండి.