ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి ఇచ్చాం: సుప్రీంకోర్టుకు తెలిపిన ఎస్‌బీఐ
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఈ విషయాన్ని తెలుపుతూ సుప్రీంకోర్టులో ఎస్‌బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది.
లైవ్ కవరేజీ
గీతాంజలి ఆత్మహత్య: 'ఆ రోజున ఇంటర్వ్యూ ఇవ్వకపోయి ఉంటే బతికి ఉండేది...' ట్రోలింగ్ బాధితురాలి మృతిపై ఎస్పీ తుషార్ ఇంకా ఏమన్నారు?
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..
గుడ్ నైట్.
లోక్‌సభ ఎన్నికలు 2024: 72 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. తెలంగాణలో 6 స్థానాలకు ప్రకటన

ఫొటో సోర్స్, ANI
లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల పేర్లను విడతలవారీగా ప్రకటిస్తోన్న బీజేపీ, బుధవారం మరో 72 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ రెండో జాబితా విడుదల చేసింది.
దిల్లీలో 2 స్థానాలు, గుజరాత్‌లో 7, హరియాణాలో 6, హిమాచల్‌ప్రదేశ్‌లో 2, కర్ణాటకలో 20, మధ్యప్రదేశ్‌లో 5, మహారాష్ట్రలో 20 స్థానాలు, తెలంగాణలో 6, త్రిపురలో 1, ఉత్తరాఖండ్‌లో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రెండో జాబితాలో హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషీ, అనురాగ్ ఠాకూర్ వంటి ప్రముఖులు ఉన్నారు.
కర్నాల్ లోక్‌సభ స్థానం నుంచి హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ బరిలోకి దిగనున్నారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్‌పుర్ నుంచి పోటీ చేయనున్నారు.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముంబయి నార్త్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనుండగా, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ హిమాచల్‌ప్రదేశ్‌లోని హమిర్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది.

ఫొటో సోర్స్, BJP/Twitter
తెలంగాణలో ఆరు స్థానాలకు..
మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటికే తొమ్మిది స్థానాలకు తొలి జాబితాలో అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ, రెండో జాబితాలో మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించింది.
అభ్యర్థులు వీరే..
ఆదిలాబాద్- గోడెం నగేశ్
పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్
మెదక్ - రఘునందన్‌రావు
నల్గొండ - శానంపూడి సైదిరెడ్డి
మహబూబ్‌నగర్- డీకే అరుణ
మహబూబాబాద్- సీతారాం నాయక్
Electoral Bonds: మార్చి 15 తరువాత ఏం తెలుస్తుంది, ఈ బాండ్లను సుప్రీం కోర్టు ఎందుకు రద్దు చేసింది?
సానియా మీర్జా: ‘మహిళల విజయాలను గుర్తించడంలో సమాజం వైఖరి ఎప్పటికీ మారదా?’
TS-TG: పాత నంబర్ ప్లేట్లను మార్చాలా, ట్యాక్సులు పెరుగుతాయా? 6 సందేహాలు, సమాధానాలు...
గీతాంజలి మరణం: సోషల్ మీడియా ట్రోలింగ్ మహిళల ప్రాణాలను తీసే స్థాయికి చేరుతోందా?
కేసీఆర్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై ఆరోపణలేంటి?
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి ఇచ్చాం: సుప్రీంకోర్టుకు తెలిపిన ఎస్‌బీఐ

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఈ విషయాన్ని తెలుపుతూ సుప్రీంకోర్టులో ఎస్‌బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది.
2019 ఏప్రిల్ 1 నుంచి 2019 ఏప్రిల్ 11 మధ్య మొత్తం 3,346 ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు కాగా.. వాటిలో 1,609 బాండ్లు రిడీమ్ అయినట్లు తన ఎస్‌బీఐ తెలిపింది.
అలాగే, 2019 ఏప్రిల్ 12 నుంచి 2024 ఏప్రిల్ 14 వరకు 18,871 ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశారని, ఈ సమయంలో 20,421 బాండ్లను నగదుగా మార్చుకున్నారని తెలిపింది.
మొత్తంగా 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 మధ్యలో 22,217 ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు అయ్యాయని ఎస్‌బీఐ సుప్రీంకోర్టుకు చెప్పింది. వాటిలో 22,030 బాండ్లను రాజకీయ పార్టీలు రిడీమ్ చేసుకున్నాయని తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలను, తేదీలను, ఎంత మొత్తంలో కొనుగోలు చేశారో వివరాలన్నింటిన్నీ ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సుప్రీంకోర్టుకు చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.
కొనుగోలు చేసిన ఆ ఎలక్టోరల్ బాండ్లను నగదుగా మార్చుకున్న తేదీల వివరాలను, ఈ బాండ్ల రూపంలో విరాళాల పొందిన రాజకీయ పార్టీల పేర్లను కూడా ఎన్నికల సంఘానికి తెలిపినట్లు ఎస్‌బీఐ తన అఫిడవిట్‌లో చెప్పింది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ప్రస్తుతం ఎస్‌బీఐ సమర్పించిన ఈ ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎన్నికల సంఘం మార్చి 15 సాయంత్రం 5 లోపు తన అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టనుంది.
ఈ డేటాను సమర్పించేందుకు జూన్ 30 వరకు సమయం ఇవ్వాలంటూ ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడంతో, నిన్న సాయంత్రం స్టేట్ బ్యాంకు ఈ వివరాలను ఈసీఐకి ఇచ్చింది.
ఈసీఐకి తాము వివరాలు సమర్పించామని తెలుపుతూ ఇవాళ ఎస్‌బీఐ సుప్రీంకోర్టులో తన కంప్లియెన్స్ అఫిడవిట్ దాఖలు చేసింది.
- ఎలక్టోరల్ బాండ్: అసలేంటీ పథకం? విమర్శలు ఎందుకు వస్తున్నాయి?
- బీజేపీకి రూ.2.5 వేల కోట్ల విరాళాలు.. ఎలక్టోరల్ బాండ్లపై మళ్లీ తలెత్తుతున్న ప్రశ్నలు
కానిస్టేబుల్ లలిత్: అమ్మాయి అబ్బాయిగా మారిపోయి, తండ్రి కూడా అయ్యారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తలపడనున్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images / Reuters
ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమాక్రాట్ల తరపున జో బైడెన్ మరోసారి పోటీ పడనున్నారు.
మంగళవారం జరిగిన డెమోక్రాట్ల ప్రైమరీ ఎన్నికల్లో జో బైడెన్ విజేతగా నిలిచారు.
వేసవిలో జరగనున్న పార్టీ సమావేశాల్లో అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గురించి అధికారికంగా ప్రకటించనున్నారు.
“ట్రంప్ గతంలో ఎన్నడూ లేనంత ప్రమాదకరంగా మారిన సమయంలో” మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు తనకు లభించిన అవకాశాన్ని ‘గౌరవంగా’ భావిస్తున్నట్లు బైడెన్ చెప్పారు.
బైడెన్ పాలన పాట్ల సానుకూలత ఉండటంతో డెమోక్రాట్ నామినేషన్లలో ఆయనకు పెద్దగా పోటీ ఎదురు కాలేదు.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి.
లాంచ్ చేసిన కొన్ని సెకన్లకే పేలిపోయిన జపాన్ రాకెట్
వీడియో క్యాప్షన్, లాంచ్ చేసిన కొన్ని సెకన్లకే పేలిపోయిన జపాన్ రాకెట్ జపాన్‌లో ఒక ప్రైవేటు కంపెనీ ప్రయోగించిన రాకెట్ లాంచ్ అయిన కొన్ని సెకన్లకే పేలిపోయింది.
బుధవారం టోక్యోకు చెందిన ‘స్పేస్ వన్’ ఈ రాకెట్‌ను ప్రయోగించింది. ప్రభుత్వానికి చెందిన ఒక చిన్న టెస్టింగ్ శాటిలైట్‌ను దీని ద్వారా పంపాలనుకున్నారు.
లాంచ్ అయిన 51 నిమిషాల్లో ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ, లాంచ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఈ రాకెట్ భారీ శబ్దంతో పేలింది.
ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని వకయామా ప్రాంతంలో కంపెనీ సొంత లాంచ్‌పాడ్‌లో జరిగింది.
రాకెట్ ప్రయోగం విఫలం కావడం వెనుక కారణం ఏంటన్నది తెలుసుకుంటున్నామని కంపెనీ తెలిపింది.
సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించాలని కేంద్రం గెజిట్

ఫొటో సోర్స్, FACEBOOK
ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేసే క్రమంలో పటేల్‌కు నమస్కరిస్తున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సెప్టెంబరు 17న హైదరాబాద్ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్‌కు స్వాతంత్య్రం తీసుకొచ్చిన అమరవీరులను స్మరించుకుంటూ, యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ఇక నుంచి ఏటా సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ నిర్వహించాలని నిర్ణయించినట్లు హోమ్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి ఇచ్చాం: సుప్రీంకోర్టుకు తెలిపిన ఎస్‌బీఐ

